బాలీవుడ్ సూపర్ స్టార్ ఎందరో నటీమణులను బాలీవుడ్‌కు పరిచయం చేసి వారికి కెరీర్‌ను అందించారు. వారిలో కొందరు సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తుంటే మరికొందరి కెరీర్ ఒక సినిమాకే పరిమితం అయిపోయింది. వారిలో డైసీ షా ఒకరు. సల్మాన్ ‘జైహో’ సినిమాలో డైసీకి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా డైసీకి బ్రేక్ ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం సల్మాన్ ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ఆలియా భట్‌ను కథానాయికగా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను ప్రస్తుతానికి వాయిదా వేశామని సల్మాన్, భన్సాలీ ఇటీవల ప్రకటించారు. అయితే సినిమాను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇందుకు కారణం సల్మాన్ మరో ఇద్దరు భామలను సినిమాలో ఎంపిక చేసుకోవాలని భన్సాలీని డిమాండ్ చేయడమేనని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. డైసీ షా, వలూషా డిసౌజాలను కూడా సినిమాలో పెట్టుకుంటే బాగుంటుందని సల్మాన్ అభిప్రాయం. అది భన్సాలీకి నచ్చలేదని అందుకే చిత్రీకరణ వాయిదా వేశారని తెలుస్తోంది. మరో కారణం ఏంటంటే.. తనకు 100 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వాలని సల్మాన్ భన్సాలీని కోరారట. తాను అంత ఇచ్చుకోలేనని భన్సాలీ చెప్పడంతో సల్మాన్‌కు కోపం వచ్చిందని సినిమా వాయిదా పడటానికి ఇది కూడా ఒక కారణమేనని బీటౌన్ టాక్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30EPhPB
No comments:
Post a Comment