సినిమా రివ్యూల మాట ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాహో తొలిరోజు రూ.23 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముంబయి బాక్సాఫీస్ వద్ద రూ.24 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. తమిళ వెర్షన్‌లో రూ.11 కోట్లు రాబట్టింది. మలయాళ వెర్షన్‌కు సంబంధించి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే సాహోపై నెగిటివ్ ప్రచారం జరిగితే మాత్రం రెండు వారాలు కూడా సినిమా థియేటర్‌లో నిలవదని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. సినిమా రిచ్‌గా ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే దగ్గర బెడిసికొట్టిందని చాలా మంది అన్నారు. ముంబయి, గుజరాత్, మరాట్వాడా ప్రాంతాల్లో సాహోకు మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో రెండు వేల ప్రింట్స్ ఆలస్యంగా వచ్చాయి. బాహుబలి తర్వాత హిందీలో బెస్ట్ డబ్డ్ వెర్షన్‌గా నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవానికే విడుదల కావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని వాయిదా వేశారు. సాహో విడుదలకు ముందు మిషన్ మంగళ్, బాట్లా హౌస్ సినిమాలు విడుదలయ్యాయి. ఆ ప్రభావం సాహో మీదే పడే అవకాశం ఉందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ug4UL8
No comments:
Post a Comment