సన్నీ డియోల్, ఊర్మిళ మటోండ్కర్ వంటి స్టార్ బాలీవుడ్ నటుుల రాజకీయాల్లోకి అడుగుపెట్టేశారు. ఇప్పుడు మరోసారి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఆయన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను కలిశారు. జంకర్ సంజయ్‌ను కలిసిన ఏ విషయం గురించి చర్చించారో తెలీదు కానీ.. సమావేశం అయ్యాక మీడియా ముందుకు వచ్చి.. సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దాంతో సంజయ్ పేరు ఇప్పుడు అందరి నోటా నానుతోంది. అయితే జంకర్ చెప్పింది అబద్ధమని తాను ఎలాంటి పార్టీలో చేరడం లేదని సంజయ్ తాజాగా ప్రకటించారు. ‘నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. 2009లో సంజయ్ సమాజ్‌వాది పార్టీ తరఫున లఖ్‌నవూ నుంచి పోటీ చేశారు. అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సంజయ్.. ఇక తన సమయాన్నంతా కుటుంబం, సినిమాల కోసమే కేటాయించాలనుకుంటున్నాని సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ప్రస్థానం’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ఇదే టైటిల్‌తో విడుదలైన సినిమాకు రీమేక్‌గా రాబోతోంది. ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన దేవాకట్టానే హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/343b7OM
No comments:
Post a Comment