విశాల్, అనీశాల వివాహం రద్దైందని చాలా కాలంగా వదంతులు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం అనీశా తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా నుంచి డిలీట్ చేయడమే. పెళ్లి ఆగిపోయిందని ఎన్ని పుకార్లు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు. అయితే విశాల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ఈ వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టారు అనీశా. ‘హ్యాపీ బర్త్‌డే స్టార్. నువ్వు స్టార్‌గా మెరవడానికే పుట్టావు. నీకు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని పేర్కొంటూ విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే.. నడిగర్ సంఘానికి ఓ కార్యాలయం నిర్మించేంతవరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అనీశాతో కూడా చర్చించానని ఇందుకు తాను కూడా ఒప్పుకుందని విశాల్ అన్నారు. అయితే ఇదే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి పెళ్లిని రద్దు చేసుకున్నాయని కోలీవుడ్ వర్గాలు అన్నాయి. మొత్తానికి అనీశా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసింది. వర్క్ పరంగా ప్రస్తుతం విశాల్ ‘యాక్షన్’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా విశాల్‌కు జోడీగా నటిస్తున్నారు. ఆ తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరవాలన్ 2’ ‘ఇరుంబు థిరాయ్ 2’ చిత్రాల్లో నటిస్తారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UeDhSu
No comments:
Post a Comment