‘కిల్ బిల్ అంటే రసీదును చంపు’.. ఇలాంటి ట్రూ ట్రాన్స్‌లేషన్‌ని ఎక్కడైనా చూశారా? ఇది నేచురల్ స్టార్ చేసిన ట్రాన్స్‌లేషన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో నాని పెన్సిల్ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇంగ్లిష్ సినిమాలు చూసి వాటిలోని డైలాగాలను తెలుగులోకి ఫన్నీగా ట్రాన్స్‌లేట్ చేస్తుంటాడు. రివెంజ్ స్టోరీలు రాసే పాత్ర ఆయనది. ఈ నేపథ్యంలో ఓరోజు అనుకోకుండా నలుగురు మహిళలు, ఓ చిన్నారి నానిని వెతుక్కుంటూ వెళ్తారు. అతనితో కలిసి ఒక్కొక్కరిపై పగలు తీర్చుకుంటూ ఉంటారు. ట్రైలర్లో.. ‘ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయచేయగలిగే ఒకే ఒక్క పవరఫుల్ వెపన్ అమ్మాయి’ అని నాని హీరోయిన్‌ను చూసి అంటాడు. దాంతో వెనకే ఉన్న నటి లక్ష్మి ‘నేను వెళతా’ అనడం నవ్వులు పూయిస్తోంది. సెప్టెంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LdrAHF
No comments:
Post a Comment