అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే పవిత్రమైన రోజు రాఖీ పౌర్ణమి. ఈ రోజున అక్కలు, చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలను కట్టి తమకు రక్షగా ఉండమని కోరుకుంటారు. ఈ దేశంలో పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు. తమకు రాఖీలు కట్టిన అక్కలు, చెల్లెళ్లకు అన్నదమ్ములు బహుమతులు ఇచ్చి సంతోషపెడతారు. ఇలాంటి అందమైన, అనుబంధంతో కూడిన పండుగ రోజున అన్నాచెల్లెళ్ల అనుబంధాలతో వచ్చిన తెలుగు సినిమాల్లోని మంచి పాటలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది. ఇలాంటి సాహిత్యం వింటుంటే అన్నదమ్ములపై అక్కచెల్లెళ్లకు.. అక్కచెల్లెళ్లపై అన్నదమ్ములకు మరింత ఆప్యాయత, అనురాగం పెరుగుతాయని మా నమ్మకం. అందుకే, మీ మనసును హత్తుకునే, అన్మాచెల్లెళ్ల అనురాగాన్ని చాటిచెప్పే కొన్ని మంచి పాటలను ఇక్కడ అందిస్తున్నాం. 1. అందాల చిన్ని దేవత - చిత్రం: శివరామరాజు 2. అన్నయ్య అన్నావంటే - చిత్రం: అన్నవరం 3. చెల్లాయే ఇల్లాలై - చిత్రం: గోరింటాకు 4. సిరిసిరి మువ్వలు - చిత్రం: గణేష్ 5. మరుమల్లి జాబిల్లి - చిత్రం: లక్ష్మీనరసింహ 6. చామంతి పూబంతి - చిత్రం: పుట్టింటికి రా చెల్లి 7. నా చెల్లి చంద్రమ్మ - చిత్రం: ఊరుమనదిరా! 8. అన్నా చెల్లెల అనుబంధం - చిత్రం: గోరింటాకు 9. సీతాకోక చెల్లి - చిత్రం: పుట్టింటికి రా చెల్లి 10. అందాల పసిపాప - చిత్రం: చిట్టిచెల్లెలు
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Z8hXPG
No comments:
Post a Comment