Raj Tarun: అతడిపై 490 కేసు.. అమ్మాయిని ట్రాప్ చేశాడు: రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర

కారు యాక్సిడెంట్ కేసులో సినిమా కథను తలపిస్తోంది. కారు యాక్సిడెంట్ చేసి పారిపోయిన రాజ్ తరుణ్.. మరుసటి రోజు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై.. హెల్మెట్ పెట్టుకోండి. సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ప్రయాణికులకు సూచనలు ఇచ్చారు. అయితే ప్రమాద స్థలం నుండి ఎందుకు పారిపోయావ్ రా బాబూ.. అంటే ఏం చేయాలో అర్ధం కాలేదని లాజిక్‌లకు దొరికిపోయే ఆన్సర్‌లు ఇచ్చాడు. Read Also: ఇదిలాఉంటే అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? ప్రమాద స్థలం నుండి రాజ్ తరుణ్ పారిపోతున్న సందర్భంలో కార్తీక్ అనే వ్యక్తి వెంటాడి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆ వీడియో రాజ్ తరుణ్‌‌ను బ్లాక్ మెయిల్ చేసి.. కుదరకపోవడంతో మీడియాకెక్కి రచ్చ చేస్తున్నాడు కార్తీక్ అనే వ్యక్తి. అయితే కార్తీక్ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు రాజ్ తరుణ్ మేనేజర్, ప్రముఖ నటుడు రాజా రవీంద్రా. అసలు కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నాడో? తెరవెనుక ఏం జరిగిందో మీడియాకి వివరించారు. ‘రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే. నేనూ టీవీలలో చూసి తెలుసుకున్నా. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేయాలో కూడా నాకు తెలియలేదు. కన్ఫ్యూజన్‌లో ఉండగా.. కార్తీక్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేశారు. అతనికి నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో తెలియదు. ‘రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేసి చెప్పులు కూడా లేకుండా పరుగెత్తుకుని పోతున్నాడు.. ఆ వీడియో నా దగ్గర ఉంది అని నాకు పంపించాడు. ఈ వీడియో మీడియాకి ఇవ్వమంటారా? లేక వచ్చి కలుస్తారా? అని అడిగాడు. అతని ఉద్దేశం నాకు అర్ధమై మళ్లీ ఫోన్ చేస్తానని నేను పెట్టేశా. ఆ తరువాత అతను ప్రతి 15 నిమిషాలకు ఫోన్ చేసి.. రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడు. నేను చాలా ఆర్ధిక పరిస్థితుల్లో ఉన్నాను.. డబ్బులు కావాలన్నాడు. అంతలేదయ్యా.. అంటే మీ పరువుకంటే ఐదులక్షలు ఎక్కువా? అని అడిగాడు. నేను తరువాత రాజ్ అసిస్టెంట్‌కి ఇతని నంబర్ ఇచ్చి మాట్లాడమని చెప్పా. అతనితో కనీసం మూడు లక్షలు ఇచ్చినా వీడియో డిలీట్ చేస్తా అన్నాడు. Read Also: కారులో మహిళ.. యాక్సిడెంట్ అనుకోకుండా అయ్యింది.. కారులో ఎవరెవరో ఉన్నారు రాజ్ తరుణ్ తాగి ఉన్నాడు అని కార్తీక్ ఆరోపిస్తున్నాడు. అతను చెప్పేవాటిలో నిజం లేదు. డబ్బుకోసమే బ్లాక్ మెయిల్ చేశాడు. కుదరక పోవడంతో ఇప్పుడు మీడియాకి ఎక్కాడు. కార్తీక్ మోసగాడు అమ్మాయిని మోసం చేసి.. కార్తీక్ ఎవరో బయట వ్యక్తి కాదు.. ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. అతనో క్యాస్ట్యూమ్ డిజైనర్. గతంలో ఆయన ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఒక షోకి వచ్చిన అమ్మాయిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. అతనిపై గృహహింస నేరం కింద 490 కేసు ఉంది. రాజ్ తరుణ్ విషయంలో నన్ను బయటకు లాగారు కాబట్టి నేను స్పందిస్తున్నా. అక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలియదు. నిజంగా అతనిదగ్గర అన్ని ఆధారాలు ఉంటే.. పోలీసులకు ఆ వీడియో ఇవ్వొచ్చు కదా. రెండురోజులు కనిపించకుండా బేరాలాడి ఇప్పుడు వచ్చి డ్రామాలాడుతున్నాడు. అతనిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటా. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అన్నారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P74fwp

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts