మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తి. ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మెగాస్టార్ ఫ్యాన్స్ ఖాతాలో చాలా మందే ఉన్నారు. వీరిలో చాలా మంది తమకు స్వయంకృషి ఎదిగిన తీరు స్ఫూర్తి అని చెబుతుంటారు. అలాంటి వాళ్లలో సంగీత సంచలనం, రాక్ స్టార్ ఒకరు. ‘ఆనందం’, ‘ఖడ్గం’, ‘మన్మథుడు’, ‘వర్షం’, ‘ఆర్య’ లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు దేవి. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్‌కు చిరంజీవి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమాతో దేవి మరో స్థాయికి వెళ్లిపోయారు. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. Also Read: చిరంజీవి ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలకు కూడా దేవీనే సంగీతం సమకూర్చారు. అంతెందుకు చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’కి కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవీపై చిరంజీవికి అంత నమ్మకం. మెగాస్టార్ తనపై కురింపించిన ప్రేమను దేవీ శ్రీ ప్రసాద్ అవకాశం దొరికినప్పుడల్లా గుర్తుచేసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా దేవీ శ్రీ కాన్సెర్ట్ జరుగుతుందంటే అందులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఆ సాంగ్‌ను దేవి మరోసారి వినిపించే అవకాశం ఆయనకు వచ్చింది. ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. నేడు చిరంజీవి 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు దేవీ శ్రీ ప్రసాద్ ‘సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్‌డే’ చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తన టీమ్‌తో కలిసి ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ టైటిల్ సాంగ్‌ను ఆలపించిన వీడియోను పొందుపరిచారు. ఈ వీడియో ద్వారా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ ఇప్పుడు దూసుకుపోతోంది. చిరంజీవి అభిమానులు విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. లైకులు కొడుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33TAIKi
No comments:
Post a Comment