తండ్రికి తగ్గ తనయుడిగా.. మెగా సామ్రాజ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెల్లగలిగే సామర్థ్యమున్న ‘మగథీరుడు’గా రామ్ చరణ్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. మెగా పవర్ స్టార్‌గా అభిమానులచేత పిలిపించుకుంటున్నారు. సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న చరణ్.. తనలాంటి మరో స్టార్ హీరో ఎన్టీఆర్‌తోనూ మల్టీస్టారర్‌కు సై అన్నారు. ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణాన్ని తీసుకురావడంలో తనవంతు చేయి వేస్తున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా మారి తన తండ్రి చిరంజీవినే హీరోగా పెట్టి సినిమా తీస్తున్నారు. చరిత్ర మరిచిపోయిన ఒక పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తన తండ్రి ద్వారా తెలుగు ప్రజలకు చెప్పబోతున్నారు. అయితే, ఇవన్నీ తాను చేయడానికి గల ఒకే ఒక్క కారణం మెగాస్టార్ చిరంజీవి అని ఈ కొణిదెల వారబ్బాయి చెబుతున్నారు. Also Read: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరంజీవి నేడు 64వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనతో పాటు తనలాంటి ఎందరికో చిరంజీవి స్ఫూర్తి అని వెల్లడించారు. ‘‘నాతోపాటు కొన్ని మిలియన్ల మందికి మీరొక స్ఫూర్తి, ఒక మెంటర్, ఒక గైడ్. వారంతా మిమ్మల్ని మెగాస్టార్ అని పిలుస్తారు. నేను మిమ్మల్ని అప్పా అంటాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అప్పా. మా అందరికి మీరు ఇలానే స్ఫూర్తినిస్తారని అనుకుంటున్నాను. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను’’ అని చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30qOth8
No comments:
Post a Comment