కాకా హోటల్ అయినా ఫైవ్‌స్టార్ హోటల్ అయినా ఫుడ్ విషయంలో నాణ్యత పాటించడంలేదు. ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా హోటల్ యజమానులు మాత్రం భయపడటంలేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే చాలా మంది చిన్న చిన్న హోటల్స్‌లో తినడానికి భయపడుతున్నారు. కానీ, పేరుమోసిన ఫైవ్ స్టార్ హోటల్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్, నటి మీరా చోప్రాకు ఎదురైన అనుభవమే దీనికి పెద్ద ఉదాహరణ. హిందీతో పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో ‘బంగారం’, ‘వాన’ వంటి సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమె అహ్మదాబాద్‌లోని హిల్టన్‌కు చెందిన డబుల్‌ట్రీ ఫైవ్ స్టార్ హోటల్‌లో స్టే చేశారు. అక్కడ ఆమెకు సెర్వ్ చేసిన ఫుడ్‌లో చిన్న చిన్న పురుగులున్నాయి. ఆ పురుగులను చూసిన మీరాకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. హోటల్‌ను ఏకిపారేశారు. వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మీరా చోప్రా.. ‘‘అహ్మదాబాద్‌లోని డబుల్‌ట్రీ హోటల్‌లో ఉన్నాను. నాకు ఫుడ్‌తో పాటు చిన్న చిన్న పురుగులను ఈ హోటల్ వడ్డించింది. ఇలాంటి హోటళ్లకు మీరు బోలెడంత డబ్బు చెల్లిస్తారు.. కానీ, ఇవి మాత్రం పురుగులను వడ్డిస్తాయి. మరీ ఇంత దారుణమా. ఎఫ్ఎస్ఎస్ఏఐ దయచేసి తక్షణమే చర్యలు తీసుకోండి. ఆరోగ్య నాణ్యత విలువలు ఎక్కడున్నాయి’’ అని ప్రశ్నించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Zs7sqp
No comments:
Post a Comment