మెగాస్టార్ చిత్రంలో పవర్ స్టార్ స్వరం వినిపిస్తే.. ఆ స్వరం చిత్ర కథలోకి మనల్ని నడిపిస్తే.. ఇక అభిమాన గణం ఆనందానికి అవధులు ఏముంటాయి! ఆ స్థాయి ఆనందం త్వరలోనే అభిమానులకు అందబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ‘సైరా’ మేకింగ్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను విడుదల చేయడంతో పాటు ‘సైరా’ టీజర్ ఈనెల 18న వస్తుందని ప్రకటించారు. ఈ టీజర్ స్వరంతో ప్రారంభంకాబోతోంది. ‘సైరా’ టీజర్‌కి కొద్ది రోజుల ముందే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే.. అన్నయ్య చిరంజీవి పక్కనే ఉన్నారు. బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన సమయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ చారిత్రక వీరుడి ఘనతను పరిచయం చేసే వాక్యాలు పవన్ కల్యాణ్ గళంతో వినబోతున్నాం. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో పవన్ కనిపించారు. తెరపై ఈ మెగా బ్రదర్స్‌ను చూసి అభిమానులు సంబరపడిపోయారు. ఇప్పుడు అన్నయ్య పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు తమ్ముడు అంతే పవర్‌ఫుల్‌గా గళాన్ని వినిపించడం అభిమానులకు పండగే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KDCrvv
No comments:
Post a Comment