యంగ్ టైగర్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటేసింది. ఒక వైపు తారక్ ఫ్యాన్స్ ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. RRR సినిమాతో 2020లో సందడి చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా అది 2022న విడుదలకు సిద్ధమైంది. దీంతో ఈ గ్యాప్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని, అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలని తారక్ భావిస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ సినిమాను ట్రాక్ ఎక్కించేయడానికి రెడీ అయిపోయారు. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాను లైన్‌లో పెట్టేశారు. తాజాగా ఇప్పుడు మరో డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఇన్నాళ్లూ వెయిటింగ్‌లో ఉండి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న సదరు డైరెక్టర్ ఎవరో కాదు.. . తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈయన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేయాలని వెయిట్ చేస్తూ వచ్చి చివరకు ఓకే చేయించుకున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు బుచ్చిబాబు తన గురువు సుకుమార్ చిన్న చిన్న సలహాలతో స్పోర్ట్స్ డ్రామా కథను యంగ్ టైగర్ కోసం సిద్ధం చేశారట. ఇందులో ఈయన కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తారని సమాచారం. అంతే కాదండోయ్ ఈ సినిమాకు బుచ్చిబాబు ‘పెద్ది’ అనే అనై టైటిల్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రాజమౌళి, రామ్ చరణ్‌తో ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా మూవీ RRR. ఈ చిత్రం మార్చి 25న విడుదలవుతుంది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన NTR 30ని ఫిబ్రవరి 7న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారని, సినిమాలో కాస్త పొలిటికల్ టచ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సినిమా రూపొందనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/84gwWdXrn
No comments:
Post a Comment