గత ఏడాది ఐకాన్ స్టార్ హీరోగా విడుదలైన ‘పుష్ప ది రైజ్’ పాన్ ఇండియా లెవల్లో చాలా పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమాపై సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే, పద్మశ్రీ అవార్డు విజేత గరికిపాటి నరసింహారావు ఫైర్ అయ్యారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన పుష్ప సినిమా ప్రధాన కథాంశం. హీరో క్యారెక్టర్‌ను మలిచిన తీరుపై ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. సమాజంలో మంచి చెడులు జరుగుతున్న తీరుపై గరికిపాటి నరసింహారావు మాట్లాడుతూ ‘‘ఇవాళ సినిమాలు ఎలా వస్తున్నాయో తెలుసు. రౌడీ, ఇడియట్ అంటూ వస్తున్నాయి. నిన్న కాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో హీరో స్మగ్లర్. అలా స్మగ్లింగ్ చేసే వాళ్లను మంచిగా చూపించారు. అదేమైనా అడిగితే చివరలో మంచిగా చూపిస్తాం లేకపోతే పుష్ప 2 తీస్తాం, ఇంకేదైనా పార్ట్ 3 తీస్తామంటారు. అంటే నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు. ఈ సినిమా కారణంగా స్మగ్లింగ్ గొప్ప అనే భావన రాలేదా!. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదే లే అంటాడా. అది పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ఇవాళ. ఎవడైనా కుర్రాడు గూబ మీద కొట్టి తగ్గేదే లే అంటాడు. మరి దీనికెవరు కారణమండి. ఇలాంటి విషయాలు మాట్లాడితే కోపమే వస్తుంది. ఆ హీరో (అల్లు అర్జున్).. డైరెక్టర్ (సుకుమార్)ని కానీ నాకు సమాధానం చెప్పమనండి, కడిగేస్తా మొత్తం. అనుమానమే లేదు. ఇలాంటి డైలాగులు వల్ల సమాజంలో నేరాలు పెరుగుతన్నాయి. తగ్గేదే లే అని ఎవడు అనాలి. హరిశ్చంద్రుడు వంటి వాడు అనాలి. లేకపోతే శ్రీరామచంద్రుడు వంటి వాడు అనాలి. ఒక స్మగ్లర్ అలాంటి డైలాగ్ వాడటం ఏంటి’’ అన్నారు. అలా గరికిపాటి నరసింహారావు.. పుష్ప సినిమాపై కోపాన్ని ప్రదర్శించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మరి అల్లు అర్జున్ అండ్ టీమ్.. సుకుమార్ ఏమైనా రియాక్ట్ అవుతారా? లేక రివర్స్‌లో ఫ్యాన్స్ ఏమైనా ట్రోలింగ్ వంటి చర్యలకు పాల్పడతారా? అనేది చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/jKHtzRQ6G
No comments:
Post a Comment