సీనియర్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ‘’. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేశారు. అంతా కరెక్ట్‌గా ఉండుంటే ఫిబ్రవరి 3న అంటే ఈ పాటికే యూనిట్ దుబాయ్‌లో ఉండేది. కానీ సినిమా యూనిట్‌ను కరోనా అడ్డుకుంది. రెడీ టు మూవ్ అని అనుకుంటున్న సమయంలో యూనిట్‌లో కొంత మంది కీలక సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో షెడ్యూల్‌ను వాయిదా వేసుకున్నారని టాక్. పరిస్థితులు కాస్త చక్కబడగానే కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ‘ది ఘోస్ట్’ తెరకెక్కుతోంది. ఇప్పటికే కొంత మేరకు చిత్రీకరణ జరిగింది. పక్కా యాక్షన్ ఎంటైర్‌టైనర్ ఇది. సినిమా కోసం డైరెక్టర్ విదేశీ యాక్షన్ డైరెక్టర్ నుండ్ అండ్ టీమ్ పనిచేయనున్నారు. ఆ టీమ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నాగార్జునతో పాటు సోనాల్‌చౌహాన్ ఇందులో పాల్గొనబోతున్నారు.అలాగే ఈ సినిమాలో గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ కూడా కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. మూవీ కోసం నాగార్జున డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుననారు. గుబురు గడ్డం, మెలితిప్పిన మీసాలు లున్న నాగార్జున లుక్ కూడా బయటకు లీక్ అయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున మాజీ ‘రా’ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందులో ముందుగా కాజల్ అగర్వాల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, ఆమె గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ప్రెగ్నెన్సీ రావడంతో ఆమె ఘోస్ట్ నుంచి తప్పుకుంది. దీంతో కాజల్ స్థానంలో అమలాపాల్, మెహరీన్ కౌర్ సహా కొంత మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ చివరకు సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంది. ది ఘోస్ట్ చిత్రంలో అనైక సురేంద్రన్, గుల్ పనాగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ దాస్ కె.నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/zwSTUNJ
No comments:
Post a Comment