తెలుగు సినిమాల్లో హిట్ కాంబినేషన్స్ విషయాన్ని ఎంత బలంగా నమ్ముతారో అంతకు మించి నమ్మే విషయం.. ఫాలో అయ్యే విషయం ‘సెంటిమెంట్’. సక్సెస్ వస్తుందనే నమ్మకమో ఏమో కానీ ఎంత పెద్ద దర్శకుడు, నిర్మాత అయినా, స్టార్ హీరో అయినా ఏదో ఒక విషయంలో సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. అలాంటి వారిలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఒకరు. రైటర్‌గా ఉన్న ఈయన దర్శకుడిగా మారిన తర్వాత అగ్ర కథానాయకులందరితోనూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. రీసెంట్‌గానే సూపర్ స్టార్ మహేష్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ ‘అ’ అక్షరం సెంటిమెంటును ఫాలో అవుతుంటారని ఇండస్ట్రీలో అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ‘అ’ తోనే మొదలవుతుంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ మాటల మాంత్రికుడు కొత్త సెంటిమెంట్‌ను స్టార్ట్ చేశాడని అర్థమవుతుంది. అందేంటంటే, హీరోయిన్స్ విషయంలో. అసలు తన సినిమాల్లో నటించే ముద్దుగుమ్మల విషయంలో త్రివిక్రమ్ ఎలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడనే వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ డైరక్షన్‌లో వచ్చిన సినిమాలు అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ. ఈ సినిమాలు అన్నింటిలోనూ సమంతనే హీరోయిన్‌గా నటించింది. అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ పక్కన.. సన్నాఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ సరసన.. అఆలో నితిన్ జతగా నటించింది. ఇప్పుడు అదే ఫార్ములాను పూజా హెగ్డేతో ఫాలో అవుతున్నారీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో చేసిన అరవింద సమేత, అలాగే అల్లు అర్జున్‌తో చేసిన అల వైకుంఠపురములో చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు మళ్లీ మహేష్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మరీ ఈసారి త్రివిక్రమ్‌కు కొత్త సెంటిమెంట్ ఎలాంటి హిట్‌ను అందిస్తుందో చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/r0jWflm
No comments:
Post a Comment