కృష్ణవంశీ సినిమాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై తెలుగుదనాన్ని ఆవిష్కరించాలంటే కృష్ణశంశీ మెగా ఫోన్ పట్టాల్సిందే. తెరపై నిండుదనం, ప్రేమలు, ఆప్యాయతలు పండాలంటే కృష్ణవంశీ సినిమాలు చూడాల్సిందే. అయితే ఆయన ఏ కోణాన్ని స్పృశించినా కూడా అందులోని లోతుల్లోకి వెళ్తాడు. కోపం, ఆవేశం, ఆగ్రహం ఇలా ఏ ఎమోషన్ అయినా సరే పీక్స్‌లో చూపిస్తాడు. అలా ఎన్టీఆర్‌తో కృష్ణవంశీ చేసిన రాఖీ సినిమాలో హై ఓల్టేజ్ సీన్స్ ఎన్నోఉణ్నాయి. మహిళల రక్షణ కోసం పాటు పడే యువకుడిగా, అన్నగా రాఖీ పాత్రలో ఎన్టీఆర్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నట విశ్వరూపం గురించి చెప్పేందుకు ఎన్నో సన్నివేశాలున్నాయి. రైల్వే స్టేషన్‌లో చెప్పే డైలాగ్, కోర్టు సీన్స్, జైలు సీన్, సమాధి దగ్గర వచ్చే సీన్ ఇలా ఎన్నో సీన్స్‌లో ఎమోషన్ పీక్స్‌లో ఉంటుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ నటనను కోట్ చేస్తూ ఓ నెటిజన్ కృష్ణవంశీకి ఓ ట్వీట్ వేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరైన సబ్జెక్ట్.. ప్యాన్ ఇండియన్ సబ్జెక్ట్ ఇది.. రాఖి 2.0లా తీయండి.. అని కృష్ణవంశీని అడిగాడు. అయితే ఈ ట్వీట్‌కు స్పందించిన కృష్ణవంశీ అతడు షేర్ చేసిన సీన్ గురించి చెప్పుకొచ్చారు. చెల్లి చనిపోయిందనే బాధలో సమాధి దగ్గర ఉండే ఆ సీన్ గురించి కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. రాఖీలో నాకు ఇష్టమైన సీన్స్‌లో ఇదొకటి.. షూట్ చేసేటప్పుడు నా నరాలు కట్ అవుతున్నట్టు అనిపించాయ్.. షూట్ చేసేప్పుడు లోపల ఏడుస్తూనే ఉన్నాను.. తారక్ పాత్రకు ప్రాణం పోసి ఆ సీన్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు.. ఇప్పుడు ఇది గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని అన్నారు. కానీ సదరు నెటిజన్ రిక్వెస్ట్ గురించి మాత్రం స్పందించలేదు. సీక్వెల్ తీస్తాడా? లేదా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kt8YH2
No comments:
Post a Comment