రామ్ చరణ్ దిల్ రాజు ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి అందరికీ తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన క్షణం నుంచి ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు ఇప్పుడు తెర దించారు. పక్కన కియారా అద్వాణీ మరోసారి జోడి కట్టబోతోందని చెప్పేశారు. తమ 50వ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్ అని దిల్ రాజు ప్రకటించేశారు. మొత్తానికి ఇన్నాళ్ల రూమర్లకు శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ బ్యూటీని దించుతారని ఇది వరకు రూమర్లు వచ్చాయి. అందులో ముఖ్యంగా కియారా అద్వాణీ పేరే ఎక్కువగా వినిపించింది. ఆల్రెడీ ఈ జోడి వినయ విదేయ రామతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫ్లాప్ అయినా కూడా ఈ జోడికి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా మార్కెట్ పరంగానూ ఆలోచించి కియారాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారాకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక దక్షిణాదిలోనూ కియారాకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందుకే దిల్ రాజు శంకర్ ఇలా కియారాను తీసుకొచ్చినట్టు టాక్. నేడు (జూలై 31) కియారా బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ఇచ్చారు. ఇక ఇప్పటికే శంకర్‌తో కియారా మాటామంతీ జరిపినట్టు.. స్క్రిప్ట్ గురించి చర్చించినట్టు కనిపిస్తోంది. దర్శకుడు హీరోయిన్ ఇద్దరూ కూడా వైట్ డ్రెస్సులో మెరిసిపోతోన్నారు. ఇద్దరూ కూర్చుని సినిమా గురించి బాగానే చర్చిస్తోన్నట్టు కనిపిస్తోంది. సీన్ల గురించి ఇప్పుడే శంకర్ తన హీరోయిన్‌కు బాగా వివరించి చెబుతున్నట్టున్నారు. ఈ మేరకు మరో ఫోటో బయటకు వచ్చింది. ఇందులో శంకర్‌ను కియారా తీక్షణంగా గమనిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ శంకర్ ప్రాజెక్ట్ మరో సారి ట్రెండ్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zUrrkd
No comments:
Post a Comment