ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులున్నాయో అందరికీ తెలిసిందే. ఇంకా కరోనా మహమ్మారి మానవాళిని వెంటాడుతూనేఉంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి సమయంలో ఇక్కడ షూటింగ్‌లు చేసుకోవడం కూడా కష్టమే. కానీ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సినిమాను పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి సమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హీరోలిద్దరి సీన్లను తెరకెక్కించేందుకు టీం మొత్తానికి ఉక్రెయిన్‌కు తరలించారట. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం చివరి షెడ్యూల్ షూటింగ్ కోసం ఉక్రెయిన్‌కు పయనమైందని సమాచారం. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభించిన రాజమౌళి అండ్ కో ఇటీవల ఈ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దోస్తీ పేరిటి మొదటి సాంగ్‌తో రచ్చ చేసేందుకు టీం మొత్తం రెడీ అయింది. ఐదు భాషలు.. ఐదుగురు సింగర్లతో కీరవాణి మ్యాజిక్ చేయబోతోన్నారు. ఒక వైపు రాజమౌళి తన హీరోలను విదేశాలకు పట్టుకెళ్తున్నారు. మొన్నటి హైద్రాబాద్ షెడ్యూల్‌లో హీరోలిద్దరిపై కీలక సన్నివేశాలను రామ్‌చరణ్‌పై ఓ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభిస్తారని తెలిసింది. ఇప్పటికే చిత్ర బృందం ఉక్రెయిన్‌కి బయలుదేరిందని తెలిసింది. ఒకటో తేదిన ప్రధాన తారాగణం, దర్శకుడు అక్కడికి చేరుకుని రెండో తేదిన షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఆగస్ట్ రెండోవారం వరకూ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తోంది. ఈ కరోనా పరిస్థితుల్లో అక్కడకి వెళ్లడం నిజంగానే రాజమౌళి సాహసం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారనే విషయం తెలిసిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rLVckw
No comments:
Post a Comment