యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న '' సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. భారీ పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత లాక్ డౌన్ రావడం, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ అప్‌డేట్స్ కరువయ్యాయి. పైగా ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. ఈ నేపథ్యంలో అదే రోజు జులై 30న కీలక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా కొత్త పోస్టర్ వదులుతూ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ సంక్రాంతి బరిలో నిలుస్తారని తెలుపుతూ అధికారిక ప్రకటన ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ మేరకు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో చేతిలో సూట్ కేసు పట్టుకొని యమ స్టైలిష్ లుక్‌లో కనిపించి అట్రాక్ట్ చేశారు ప్రభాస్. విడుదలైన కొన్ని క్షణాల్లోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ లైకులతో మోత మోగిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ చివరి షెడ్యూల్ ఫినిష్ అయినట్లు తెలిపిన దర్శకనిర్మాతలు అతి త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BPZwUp
No comments:
Post a Comment