బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త పోర్నోగ్రఫీ కేసు బీ టౌన్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అశ్లీల చిత్రాలు షూట్ చేసి యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే అభియోగంతో జులై 19వ తేదీన రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. జులై 27 వరకు పోలీస్ కస్టడీలో ఉంచుతూ ఈ వ్యవహారం వెనుక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో కూపీ లాగుతున్నారు ముంబై క్రైం బ్రాంచ్ అధికారులు. ఈ విచారణలో భాగంగా ఒక్కొక్కటిగా బయటకొస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పోర్నోగ్రఫీ ఇష్యూలో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి? ఎవరెవరు ఇందులో పాత్రదారులు అనే వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. విచారణను వేగవంతం చేసి రహస్యాలు చేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్ కుంద్రా ఇంట్లో సోదాలు నిర్వహించి, ఆయన భార్య శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని సేకరించిన పోలీసులు.. ఈ పోర్నోగ్రఫీ వ్యవహారంలో ముందు నుంచి వార్తల్లో నిలుస్తున్న షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ చేశారు. షెర్లిన్ చోప్రా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ సెల్ ఆమెకి నోటిసులు ఇచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. కాగా రాజ్ కుంద్రా కేసులో మొదట పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది తానేనని ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించింది . దీంతో ఆమె విచారణ అనంతరం రాజ్ కుంద్రాకు మరింత చిక్కుల్లో పడొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇదే రోజు (జులై 27) రాజ్ కుంద్రా బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది ముంబై హై కోర్టు. రాజ్ కుంద్రాకు బెయిల్ రావడం పక్కా అని అంటున్నాడు ఆయన తరఫు న్యాయవాది. సో.. చూడాలి మరి పోలీసుల ఎదుట హాట్ బ్యూటీ షెర్లిన్ ఎలాంటి సీక్రెట్స్ బయటపెడుతుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wr9zir
No comments:
Post a Comment