‘ఛలో’ అంటూ టాలీవుడ్ గడపతొక్కి అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారింది కన్నడ భామ . తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రష్మిక ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ‘గీతగోవిందం’, ‘దేవదాస్’, ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి సినిమాలతో మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ఈ భామ ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో పాటు తెలుగులో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, బాలీవుడ్‌లో ‘మిషన్ మంజు’, ‘గుడ్‌బై’ అనే సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ మధ్యే ఆమె తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కార్తీ హీరోగా వచ్చిన ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక.. అక్కడ కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది. అయితే ఇప్పుడు ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిందట. ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు త్వరలోనే తమిళ హీరో శివ కార్తికేయన్‌తో ఈ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రష్మికను హీరోయిన్‌గా అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే అనుదీప్, రష్మికకు కథ కూడా వినిపించారని తెలుస్తోంది. రష్మిక కూడా దాదాపు ఓకే చెప్పేసినట్లు టాక్. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే.. అధికారికంగా సమాచారం వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f7EaIc
No comments:
Post a Comment