సీనియర్ హీరోయిన్ భర్త, బిజినెస్‌మెన్ పోర్న్ రాకెట్ వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. శృంగార చిత్రాలను నిర్మించి, వాటిని ఇంటర్నెట్ యాప్స్‌లో పబ్లిష్ చేస్తున్నారనే అభియోగంతో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కుంద్రాకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు.. ఈ కేసుకు సంబంధించిన వాళ్లకు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొద్ది రోజుల అయితే ఈ కేసు గురించి ఇప్పటికే చాలా మంది.. చాలా సంచలన విషయాలు వెల్లడించారు. తాజాగా నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఈ కేసు గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను అశ్లీల సీన్లు చేయాలని అభ్యర్థించాడని.. అంతేకాక షూటింగ్‌కి ముందే అలా నటించి వీడియోలు పంపాలని కోరాడని ఆమె ఆరోపించింది. గతంలో సోఫియా హాలీవుడ్‌లో కొన్ని బెడ్రూం సీన్లు చేసింది. దీంతో నిజంగా అలాంటి సినిమాలు చేసేవాళ్లు ఎవరూ ముందుగా అలా చేయాలని అడగరు అని.. దీంతో ఆ ఏజెంట్‌ను తాను నమ్మలేదని ఆమె పేర్కొంది. ఇక బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను ఇలాంటి ఏజెంట్లు మోసం చేస్తున్నారని ఆమె పేర్కొంది. డబ్బుల కోసం ఏదైనా చేసే బిజినెస్‌మెన్ గ్లామర్ మోజులో ఉన్న యువతులను ట్రాప్ చేస్తారని ఆమె చెబుతోంది. అవకాశాల పేరు చెప్పి అశ్లీల చిత్రాల్లో నటింపచేస్తారని హెచ్చరిస్తోంది. అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారం చేయడంతో సమానమని సోఫియా తెలిపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3l83thi
No comments:
Post a Comment