విక్టరీ ఎప్పుడూ కూడా తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోరు. తన నటన, తన సినిమాల ఫలితం గురించి అంతగా చెప్పుకోరు. అయితే తన సినిమా సక్సెస్ ఫంక్షన్‌లో కూడా దాని ఒరిజినల్ సినిమా గురించి మాట్లాడుతూ అక్కడి దర్శకుడు, హీరోల గురించి కామెంట్ చేశారు. ఈ క్రమంలో దటీజ్ వెంకీ అని అభిమానులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో వెంకటేష్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో చూడాల్సిన ‘నారప్ప’ ఓటీటీలో వచ్చినందుకు ప్రేక్షకులకు బాధగా అనిపించినా.. మా పరిస్థితిని అర్థం చేసుకుని గొప్పగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను అని వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు. సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. 25ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు చేశాను. కానీ, ఈ సినిమా, ఇందులో నా పాత్ర చాలా విభిన్నమైనది. నటుడిగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు వెట్రిమారన్, ధనుష్‌లకు థ్యాంక్స్. వాళ్లు ‘అసురన్’ చేయకపోతే.. ఈరోజు ఈ ‘నారప్ప’ లేదు. కచ్చితంగా ప్రేక్షకులందరికీ థియేటర్లో మరో మంచి సినిమా చూపిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. సంక్రాంతికి ‘ఎఫ్3’ సినిమాతో తప్పకుండా వినోదాలు అందిస్తానని అన్నారు. అంటే ఈ లెక్కన దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతోన్నామని పరోక్షంగా చెప్పినట్టైంది. ఈ సక్సెస్ మీట్‌లో అనిల్ రావిపూడి, ప్రియమణి, కార్తిక్ రత్నం, రాఖీ, అనంత శ్రీరామ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37bkGyg
No comments:
Post a Comment