‘బాహుబలి’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ సినిమా కాస్త నిరాశపరిచినప్పటికీ.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ప్రస్తుతం ఆయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘’ ఒకటి. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిన చాలాకాలమే అయింది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్, టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత చిత్ర యూనిట్ గురించి అప్‌డేట్లు కరువయ్యాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. అందరూ హీరోలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు వస్తుంటే.. తమ హీరో సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎందుకు విడుదల చేయడం లేదంటూ చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్ అభిమానులకు సినిమా దర్శకుడు రాధాకృష్ణ తాజాగా గుడ్ న్యూస్ అందించారు. సినిమా చివరి షెడ్యూల్ కూడా పూర్తి అయిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఈ పాండమిక్ మనందరి ఊహలను నిరాశపరిచింది. ఎంతో ఓపికగా డార్లింగ్ ఫ్యాన్స్ అందరిపై నా ప్రేమను కురిపిస్తున్నాను. అధికారక అప్‌డేట్ మరో మూడు రోజుల్లో వస్తుంది. అందరం ఎదురుచూద్దాం’ అంటూ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BURVUi
No comments:
Post a Comment