రోబో బ్యూటీ పెళ్లి కాకుండానే తల్లి అయిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ప్రేమలో మునిగితేలిన ఆమె.. అతనితో సహజీవనం చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చి 2019 సంవత్సరం సెప్టెంబరు 23న కుమారుడికి జన్మనిచ్చింది. అయితే ఇప్పటికీ తన ప్రియుడిని పెళ్లాడకుండా ఆయనతో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీ.. అనూహ్యంగా ఆయనతో కట్ చేసుకుందని తెలుస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అమీ జాక్సన్‌కు జార్జ్‌కు మధ్య వ్యక్తిగత విభేదాలు చోటు చేసుకున్నాయనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తుండగా.. తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్‌స్టాగ్రామ్‌లో జార్జ్ పనాయొటోతో దిగిన ఫొటోలను డిలీట్ చేయడం అనుమానాలకు తెరలేపింది. ప్రియుడితో ఆమెకు చెడింది కాబట్టే అమీ జాక్సన్ ఇలా ఆయన ఫొటోస్ అన్నీ డిలీట్ చేసిందని, ఇక ప్రియుడితో ఆమె బ్రేకప్ కన్ఫర్మ్ అయినట్లే అని చెప్పుకుంటున్నారు జనం. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. 2010 సంవత్సరంలో 'మద్రాసుపట్నం' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించింది. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రేమాయణం కొనసాగించిన ఆమె.. మళ్ళీ ఇప్పుడు కెరీర్‌పై దృష్టి పెట్టాలని చూస్తోందట. ఇండియాకు తిరిగి వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి స్థాయిలో తన జీవితాన్ని నటనకు అంకితం చేయాలని భావిస్తున్నట్లు తన సన్నిహితులతో ఆమె చెబుతోందట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zKoRNG
No comments:
Post a Comment