సోషల్ మీడియాలో చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక సినిమాలు, షూటింగ్‌లంటూ ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యాన్స్, ఫాలోవర్లను పట్టించుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటారు. మధ్య మధ్యలో లైవ్‌లోకి వస్తారు.. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా పెడతారు. అలా రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. సోషల్ మీడియాలోని క్రేజ్‌తోనే రష్మికకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ వచ్చేసింది. బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయకపోయినా కూడా రష్మిక మందన్నాకు భారీ స్థాయిలో క్రేజ్ దక్కడానికి కారణం సోషల్ మీడియానే. గీత గోవిందం లాంటి డబ్బింగ్ సినిమాతోనూ హిందీలో రష్మికకు క్రేజ్ ఏర్పడింది. అలా ఇప్పుడు రష్మిక చేతిలో రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు వచ్చి పడ్డాయి. ఇప్పుడు రష్మిక మందన్నా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ బిజీగా తిరుగుతున్నారు. రష్మిక ఈ మధ్య ఓ పెట్‌ను తెచ్చుకున్నారు. మొన్నామధ్య ఛార్మీని ముంబైలో కలిసిన రష్మికకు ఈ పెట్ లభించినట్టుంది. అప్పటి నుంచి ఈ పెట్‌ను ఆరాగా పెంచుకుంటూ ఉన్నారు. పెట్‌తో ఆడుకుంటున్న వీడియోలను రష్మిక పోస్ట్ చేయగా అవి తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో షర్ట్‌ను విప్పుతున్నట్టుగా చూపించారు. నేను కళ్లతో మాట్లాడాలని అనుకుంటున్నాను..దీనికి మీరు ఎలాంటి క్యాప్షన్ పెట్టాలని అనుకుంటున్నారు అని రష్మిక అందరినీ అడిగారు. రష్మిక ప్రస్తుతం పుష్ప, ఆడాళ్లూ మీకు జోహార్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eqp0xi
No comments:
Post a Comment