తెలుగు తెరపై ఎందరో కమెడియన్స్ హీరోలు కావడం చూశాం. అప్పట్లో బాబు మోహన్, ఆలీ హీరోలుగా మారి హీరోయిన్లతో చిందులేయగా.. ఈ మధ్యకాలంలో కమెడియన్ సునీల్ హీరో అవతారమెత్తి చాలా సినిమాలే చేశారు. తాజాగా అదే బాటలో కూడా వెళుతున్నారనే వార్త గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కమెడియన్‌గా, నిర్మాతగా తన మార్క్ చూపించిన బండ్ల గణేష్ హీరోగా చేసేందుకు ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ముదిరింది. తాజాగా దీనిపై ఆయన క్రేజీ రియాక్షన్ ఇవ్వడంతో నెటిజన్స్ రెచ్చిపోతున్నారు. వెంకట్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో బండ్ల గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే ఇది కేవలం రూమర్ అని అంతా భావించగా.. తాజాగా ఓ మీడియా దీనిపై ప్రసారం చేసిన కథనాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ సినిమా నిజంగానే బండ్ల చేస్తున్నాడేమో అనే భావన కలిగించేలా కేవలం నవ్వుతున్న ఎమోజీ పోస్ట్ చేశారాయన. ఇంకేముంది ఇది చూసి నెటిజన్స్ తమ కామెంట్లకు పదును పెట్టేస్తూ ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. బండ్లన్న హీరోగా చేస్తే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ కావడం పక్కా అని కొందరు సెటైరికల్ కామెంట్స్ చేస్తుండగా మా బండ్లన్నకు ఏం తక్కువ? హీరోగా చేయడానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయని ఇంకొందరు ఆయనను సపోర్ట్ చేస్తున్నారు. ఇక చాలామంది కన్ను ఆయనతో నటించబోయే హీరోయిన్‌పై పడింది. 'హీరోయిన్‌గా కావాలి' అని ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ హైలైట్ కావడమే గాక ట్విట్టర్ వేదికపై రచ్చ చేస్తోంది. సో.. చూడాలి మరి బండ్ల గణేష్ నిజంగానే హీరో కాబోతున్నారా? లేక ఏదో ఫన్నీగా తీసుకొని అలా రియాక్ట్ అయ్యారా? అనేది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k98y8q
No comments:
Post a Comment