సినీ నటుడు, క్రిటిక్ మరణవార్త సినీ వర్గాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. చివరికి వరకు చావుతో పోరాడి ఓడిపోయారు. అంతా కత్తి మహేష్ త్వరలోనే ఆసుపత్రి నుంచి తిరిగి వస్తారని అనుకుంటున్న తరుణంలో శనివారం రోజు ఆయన కన్నుమూశారనే వార్త ఆశ్చర్యపరిచింది. ఆయన మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బర్నింగ్ స్టార్ రియాక్ట్ అవుతూ ఎమోషనల్ కామెంట్ చేశారు. కత్తి మహేష్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు సంపూర్ణేష్ బాబు. ''ఎన్నో జ్ఞాపకాలు.. మంచి స్నేహితుడిని కోల్పోయాను'' అని సింగిల్ లైన్ ఎమోషనల్ కామెంట్ చేస్తూ కత్తి మహేష్‌తో షూటింగ్ సమయంలో దిగిన పిక్ షేర్ చేశారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్‌పై నెటిజన్స్ నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలని కొందరు అంటుంటే, ఆయనలో కనిపించిన ఒక మంచి విషయం చెప్పు బ్రో అంటూ సంపూ పోస్ట్‌పై మరికొందరు కామెంట్స్ వదులుతున్నారు. సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ చిత్రంలో కత్తి మహేష్ నటించారు. శృంగార తారగా ఓ వెలుగు వెలిగి.. స్టార్ హీరోలకు సైతం చెమటల పట్టించిన శృంగార తార షాకేల భర్తగా కత్తి మహేష్ నటించారు. అప్పటినుంచి కత్తి మహేష్- సంపూర్ణేష్ బాబు బాబు మధ్య స్నేహబంధం బలపడింది. జూన్ 26వ తేదీన నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కొడవలూరు హైవే వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటినుంచి చికిత్స పొందుతున్న కత్తి మహేష్.. అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు. నేడు (ఆదివారం) ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలంలోని యలమంద గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i0rMKI
No comments:
Post a Comment