‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన భామ మెహ్రీన్ పిర్జాదా. తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. గ్రాండ్ సక్సెస్‌లు అందకపోయినా.. కెరీర్‌లో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకు సాగుతోంది మెహ్రీన్. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్-2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెహ్రీన్ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఎఫ్-3’ సినిమాలో ఆమె నటిస్తోంది. దీంతో పాటు మారుతి-సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మరో సినిమా ఒప్పుకుంది. ఈ ఏడాది మార్చిలో మోహ్రీన్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జైపూర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. ఎంతో వైభవంగా వీరిద్దరి నిశ్చతార్థ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అకస్మాత్తుగా తన నిశ్చతార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మెహ్రీన్ అందరికీ షాక్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి, స్నేహపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక భవ్యతో కానీ, అతని కుటుంబసభ్యులతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పింది. సాధారణంగా ఎవరైనా నిశ్చితార్థం బ్రేక్ అయితే.. కాస్త దుఖంలో ఉంటారు. కొన్ని రోజుల పాటు ఎవరికి కనిపించకుండా ఉంటారు. ఇంకొందరు అయితే డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోతారు. కానీ, మెహ్రీన్‌లో మాత్రం ఆ బాధ ఏమాత్రం లేనట్లే అనిపిస్తుంది. అందుకు భిన్నంగా ఆమె ప్రవర్తన కనిపిస్తుంది. పొట్టి డ్రెస్ వేసుకొని.. నడుము అందాలు చూపిస్తూ.. నవ్వులు చిందిస్తూ.. బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన పిక్స్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘చిన్నపిల్లలా మారిపోయాను’ అంటూ దానికి మెహ్రీన్ క్యాప్షన్ పెట్టింది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r0cwBE
No comments:
Post a Comment