'కత్తి మహేష్ చనిపోయాక ఇలా రాయడం ఏంటి అనే వాళ్లకి నా సమాధానం'

సినీ క్రిటిక్, నటుడు మరణంపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఆయన బ్రతికుండగా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని కొందరు సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే శ్రీ రెడ్డి, పూనమ్ కౌర్ వారి వారి రియాక్షన్స్ చెప్పడంతో కత్తి మహేష్ డెత్ ఇష్యూ చర్చల్లో నిలిచింది. అయితే వ్యక్తిత్వ వికాసం, టెక్నాలజీ ప్రభావం, ఆన్‌లైన్ భద్రత లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ అప్పుడప్పుడూ సమాజ విషయాలపై స్పందించే తాజాగా కత్తి మహేష్ మరణంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. శ్రీధర్ నల్లమోతు పెట్టిన పోస్ట్ ఉన్నది ఉన్నట్లుగా చూస్తే.. ఒక వ్యక్తిగా మిత్రులు కత్తి మహేష్‌‌ మీద అపారమైన గౌరవంతో.. ఇప్పటికైనా కొన్ని విషయాలు రాయకపోతే మరుగునపడిపోతాయని ఇది రాస్తున్నాను. కత్తి మహేష్ గారు మేధావి, చాలా ఆలోచనా పరుడు అని అందరం అంటున్నాం. మేధస్సు అంటే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచేది, సమాజంలో అశాంతి రేకెత్తించేది కాదు అని ఎంతమందికి తెలుసు? కత్తి మహేష్ అణగారిన వర్గాలకు ధైర్యమున్న స్వరం అని అంటుంటారు.. చాలా గొప్ప విషయం. ప్రతీ వర్గానికీ అలాంటి ఒకరు ఉండాలి.. కానీ అణగారిన వర్గాలకు రాముడు ఏ అన్యాయం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏ అన్యాయం చేశాడు? శ్రీరాముడు ఉన్నాడా లేదా అన్నది పక్కన పెట్టండి.. ఏ మేధావైనా ఇతరుల అభిప్రాయాలూ, మనోభావాలను గౌరవిస్తాడు. శ్రీరాముడిని కొన్ని కోట్ల మంది ఆరాధిస్తారు. ఇతరుల నమ్మకాలను గౌరవించాలన్న సంస్కారం లేనప్పుడు అదేం మేధస్సు? లైమ్‌లైట్‌లోకి రావడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి ఏది మాట్లాడితే తేనెతుట్టె కదులుతుందో ఆ వివాదాస్పద అంశాలను మాట్లాడడమే మేధస్సా? ఈ మేధస్సుతో మిగతా వాళ్లు ఇన్‌స్పైర్ అయి మీరు కూడా సమాజంలో విచ్ఛిన్నం సృష్టిస్తారా? ఒకరోజు NTV డిబేట్‌కి మిత్రులు కత్తి మహేష్ నేనూ వెళ్లాం. క్రింద ఛాంబర్‌లో NTV న్యూస్ రీడర్ చక్రి నేను, కత్తి మహేష్ మాట్లాడుకుంటూ ఉండగా, చక్రి బయటకు వెళ్లారు పని ఉండి! నేను కత్తి మహేష్‌ని అడిగాను.. ఎందుకు ఇలాంటి వివాదాల్లోకి వెళుతుంటారు అని చనువు కొద్దీ! "మరి రాజకీయాల్లోకి వెళ్లాలి కదా" అని నవ్వుతూ బదులిచ్చారు. అంటే రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఓ ఎజెండాతో సమాజంలో విచ్చిన్నం రేకెత్తించడం ఎంత వరకూ సమజసం? నేను ఏమీ అనలేక ఊరకుండిపోయాను. ఒక వ్యక్తి స్వార్థానికి సమాజంలో గొడవలు రేగడం ఎంత వరకూ సమంజసం? రాజకీయాల్లోకి వెళ్లాలంటే సేవ చేసి వెళ్లొచ్చు కదా! ఏదో రకంగా పాపులారిటీ రావడమే ముఖ్యమా? కత్తి మహేష్‌కి చాలా సర్కిల్ ఉంది. ఆయన వ్యక్తిగా చాలా మంచి వాడు అని అందరూ మెచ్చుకుంటారు. నాతోనూ ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. కానీ వ్యక్తి స్థాయిలో ఉన్నప్పుడు వేరు, అందరికీ తెలిసిన సెలబ్రిటీగా మారినప్పుడు మరింత బాధ్యతతో ఉండాలి కదా! వ్యక్తిగా ఒకరొకరు నవ్వుకుంటే, భోజనం చేస్తే, కాఫీలు తాగితే సరిపోతుందా.. కోట్లాది మందికి విద్వేషపు సంకేతాలు పంపిస్తూ, ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని దూషిస్తూ చేసేది ఏంటి? కత్తి మహేష్‌తో ఉన్న పరిచయాన్ని గ్లామరైజ్ చేసుకునే వాళ్లకి ఆయన గొప్ప కావచ్చు.. సమాజం బాగుండాలని బాధ్యతగా ప్రవర్తించే వాళ్లకి ఆయన ఏమాత్రం గొప్ప కాదు. అణగారిన వర్గాల ఊపిరి కత్తి మహేష్ అని గొప్పగా చెబుతున్నారు.. సరే బానే ఉంది. అణగారిన వర్గాలతో పాటు ఆయన చుట్టూ ఉన్నత వర్గాలూ కూడా ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. వారెప్పుడైనా ఆయనకి ఆన్యాయం చేశారా? అంతా ఓ స్వంత మనిషిలా ఆయన్ని ట్రీట్ చేశారు కదా.. మరి తన తరంలో వివక్ష లేనప్పుడు, ఎప్పుడో చరిత్రలో జరిగిన వివక్ష గురించి చీకటిలో బాణాలు వేయడం ఏంటి? ఓ వర్గాన్ని తన వైపు తిప్పుకుని రాజకీయంగా ఎదగడానికా? నిజంగానే ఇప్పుడు కూడా వివక్ష ఎక్కడైనా జరుగుతుంటే వెళ్లి స్వయంగా న్యాయం చేయొచ్చు కదా.. అంతే గానీ గంపగుత్తుగా బాగున్న సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం ఏం మేధస్సు? ఇలాంటి మేధావుల నుండి ఏం నేర్చుకుంటారో ఈ సమాజం యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ద్వేషం వెదజల్లి, దాని నుండి పాపులారిటీ సాధించేది ఏం మేధస్సు? ఇంత బోల్డ్‌గా ఇది రాయడం చాలామందికి నచ్చదని తెలుసు.. కానీ కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడడం కత్తి మహేష్‌కే కాదు నాబోటి వాడికీ అలవాటే. నాబోటి వాడు సమాజంలో మంచిని పెంచుతాడు.. మిగతా మేధావులు విద్వేషాలు రెచ్చగొడతారు. గమనిక: ఎవరైనా నన్ను విమర్శిస్తూ కామెంట్లు రాస్తే, మొదట పైన నేను రాసిన ప్రతీ పాయింట్‌కీ వివరంగా సమాధానం చెప్పే ఆ తర్వాత నన్ను విమర్శించండి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వాడు ఎలా మేధావవుతాడు? ఓసారి గుండె మీద చెయ్యి వేసుకుని సమాధానం చెప్పి ఆ తర్వాత కామెంట్ రాయండి. లేదంటే పిచ్చి పిచ్చి కామెంట్లని, వ్యక్తుల్ని నిర్ధాక్షిణ్యంగా బ్లాక్ చేస్తాను. ఆయన చనిపోయాక ఇలా రాయడం ఏంటి అనే వాళ్లకి ఒక్కటే సమాధానం.. ఆయన బ్రతికున్నప్పుడు సమాజంతో మంచిగా ఉంటే, సమాజం ఇంతగా స్పందించేది కాదు, మంచిగా చూసుకునేది. ధన్యవాదాలు. - నల్లమోతు శ్రీధర్


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e7bkXV

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts