టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సినీ నటి శ్రీసుధ గతంలో తనను పెళ్లి చేసుకుంటానని ఐదేళ్లు సహ జీవనం చేసి మోసం చేశారని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కేసు, కోర్టులంటూ పెద్ద రచ్చే జరిగింది. చివరకు తెలంగాణ హైకోర్టు శ్యామ్ కె.నాయుడుకి బెయిల్ ఇచ్చింది. అయితే తనకు శ్యామ్ కె.నాయుడు మూలంగా ప్రాణ హాని ఉందని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని శ్రీసుధ.. తెలంగాణ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్టులో కేసు వేశారు. కేసు పూర్వాపలాలు పరిశీలించిన కోర్టు శ్యామ్ కె.నాయుడుకి బెయిల్ ఇవ్వాలని తెలిపారు. శ్యామ్ కె.నాయుడు, శ్రీసుధ కేసులో .. తాను ఒప్పందం ప్రకారమే చేశానని అందుకు రూ.50 లక్షలు డీడీ రూపంలోచెల్లించానని పత్రాలను శ్యామ్ కె.నాయుడు కోర్టుకు సమర్పించాడు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవి నకిలీ పత్రాలని తమ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని శ్రీసుధ తెలియజేసింది. తనను చంపడానికి కుట్ర చేశారని, శ్యామ్ కె.నాయుడుతో పాటు ఆయన సోదరుడు ఛోటా కె.నాయుడు కూడా తనను బెదిరిస్తున్నారని, చంపడానికి కుట్ర చేస్తున్నారని శ్రీసుధ ఆరోపణలు చేశారు. తన కారుని కూడా కావాలని యాక్సిడెంట్ చేశారని ఆమె పేర్కొంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. శ్రీసుధ అసలు పేరు సాయి సుధా రెడ్డి ఈమె ఫిజియో థెరపిస్ట్. సినిమాలపై ఆసక్తితో ఇటు అడుగులు వేశారు. బాడీగార్డ్, దమ్ము, అర్జున్ రెడ్డి, ఎవరు, అవును వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు. ఆ క్రమంలోనే శ్యామ్ కె.నాయుడుతో పరిచయం ఏర్పడి సహ జీవనం వరకు దారి తీసింది. అయితే ఆయనకు అప్పటికే పెళ్లై పిల్లలు ఉండటంతో గొడవలు ప్రారంభం అయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/6jhc8Rz
No comments:
Post a Comment