తెరపై ఎంత సరదాగా కనిపిస్తారో రియల్ లైఫ్‌లోనూ అంతే సరదాగా ఉంటుంది. బుల్లితెరపై అయినా, యూట్యూబ్ వీడియోల్లో అయినా, ఇన్ స్టాగ్రాంలో అయినా కూడా అషూ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అయితే అషూ రెడ్డి చేసే వింత ఫోటో షూట్లు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. రకరకాల పోజులు పెట్టి అందరనీ నవ్విస్తుంటుంది. పని మనిషిలా, చీపురు పట్టుకుని ఈ మధ్య షేర్ చేసిన ఫోటోలపై రియాజ్, హరి, రవి చేసిన కామెంట్లు ఫుల్ వైరల్ అయ్యాయి. అలా ఏదో ఒక కారణంతో అషూ మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇక వివాదాలు అయితే అషూకి చాలా ఇష్టమున్నట్టు కనిపిస్తుంది. ఆ మధ్య ఆర్జీవీ వ్యవహారం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ, పవన్ కళ్యాణ్ టాటూ వ్యవహారం, ఎక్స్ ప్రెస్ హరి టాటూ ఇలా ఎన్నెన్నో విషయాలతో అషూ రెడ్డి నిత్యం హాట్ టాపిక్ అవుతుంటుంది. తాజాగా అషూ రెడ్డి తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఇన్ స్టా స్టోరీల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొదలుపెట్టేసింది. ఒక్కో నెటిజన్ ఒక్కో రకమైన ప్రశ్నను సంధించాడు. మామూలుగా సెలెబ్రిటీలను నంబర్ అడగడం కామన్. కానీ ఇక్కడ మాత్రం అషూకే నంబర్ పంపించి.. అక్కా నీతో మాట్లాడాలని ఉంది కాల్ చేయ్ అని అని మెసెజ్ పెట్టాడు. దానికి అషూ రెడ్డి తల పట్టుకున్నట్టుగా ఫోటో పెట్టి రిప్లై ఇచ్చింది. అసలు కథ అప్పుడు మొదలైంది. అందులో సదరు నెటిజన్ నంబర్ కనిపించింది. అలా నెటిజన్ నంబర్ అషూ రెడ్డి షేర్ చేయడంతో.. ఆమె ఫాలోవర్లంతా కూడా అతగాడికి ఫోన్‌లు చేస్తున్నారట. కాల్స్‌తో చంపుతున్నారు.. ఆ పోస్ట్ డిలీట్ చేయ్ అక్కా అని వేడుకున్నాడు. కానీ అషూ మాత్రం ఎంతో కూల్‌గా సేవలను ఎంజాయ్ చేసుకో అని చెప్పేసింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0SHAYby
No comments:
Post a Comment