కోలీవుడ్ అగ్ర కథా నాయకుడు విజయ్ ఎక్కడా అధికారికంగా చెప్పలేదు. కానీ..ఆయన రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా. ఎందుకంటే ఆయన చాప కింద నీరులా తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల తమిళనాడులో జరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో విజయ్ అభిమానం సంఘం విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి కొంత మంది సభ్యులు పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మరో అడుగు ముందుకు వేశారు. శనివారం సాయంత్రం పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామితో దళపతి విజయ్ భేటీ అయ్యారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పుదుచ్చేరి సీఎం ఎన్.రంస్వామి స్వయంగా హీరో విజయ్‌ను కలవడానికి వచ్చారు. పుదుచ్చేరిలో ఎన్.ఆర్ కాంగ్రెస్ - బీజేపీ కూటమి అధికారంలో ఉంది. రంగస్వామి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని వెళ్లి కలవలేదు. కానీ హీరో విజయ్‌ను కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. అదీ కాకుండా పుదుచ్చేరి కార్పొరేట్ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయక్కం నుంచి అభ్యర్థులు పోటీలో ఉండటం విశేషం. హీరో విజయ్‌తో భేటీ అనంతరం రంగస్వామి బయటకు వచ్చినప్పుడు ఆయన్ని మీడియా ప్రశ్నించగా.. మర్యాద పూర్వకంగానే కలిశామని ఆయన తెలిపారు. విజయ్ తనకు మంచి మిత్రుడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విజయ్ రాజకీయంగా ముందుకు వెళుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇన్ డైరెక్ట్‌గా ఆయన తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం బీస్ట్ అనే చిత్రంలో విజయ్ నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. మరో వైపు దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలోనూ విజయ్ నటించబోతున్నారు. త్వరలోనే ఆ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/YQRZArz
No comments:
Post a Comment