టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయన తార చేతులు కలిపారు. ఇంతకీ వీరిద్దరూ ఏ సినిమా కోసం అని అనుకుంటున్నారా! సినిమా కోసమండి.. చిరంజీవి, నయన తార ఇంతకు ముందు జోడీగా నటించారు. ఇప్పుడు అన్నా చెల్లెలుగా నటిస్తున్నారు. టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళ సినిమా ‘లూసిఫర్’కు ఇది రీమేక్. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో నయనతార నటిస్తుంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌లో నయనతార పాల్గొన్నారు. సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఆమె చెన్నై వెళుతున్న క్రమంలో కెమెరాల కంటికి చిక్కారు. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ మూవీ లూసిఫర్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటుంది. ఎడిటర్ మోహన్ తనయుడు, తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు ఓ టైటిల్ పోస్టర్ మాత్రమే విడుదలైంది. కానీ సినిమా షూటింగ్‌ను చకచకా పూర్తి చేసేస్తున్నారు. చిరంజీవి కోవిడ్ కారణంగా క్వారంటైన్‌లో ఉండటంతో నయనతారపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పొలిటికల్ టచ్‌తో సాగే గాడ్ ఫాదర్ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండం విశేషం. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటి వరకు జరగలేదు. ఓ వారం రోజుల సమయాన్ని సల్మాన్ ఖాన్ కేటాయిస్తే చాలని మెగా టీమ్ వెయిటింగ్‌లో ఉంది. చిరంజీవిని సపోర్టర్‌గా, ఆయనకు రైట్ హ్యాండ్‌లాంటి పాత్రలో సల్మాన్‌ఖాన్ కనిపించనున్నారు. కేవలం యాక్షన్ సన్నివేశాలతో పాటు చిరు, సల్మాన్ కలిసి స్టెప్పులేసి అభిమానులను మెప్పించబోతున్నారట. దీంతో పాటు ఇప్పుడు చిరంజీవి మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మరో వైపు చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/VSBmxg7dQ
No comments:
Post a Comment