కమెడియన్‌గా, నటుడి ఎదుగుతూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో తాను నటించనని అన్నారు. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తెలియజేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదో అప్ కమింగ్ నటుడే కదా.. అని అనుకోవడానికి వీలు లేదు. ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాల్లో దాదాపు అన్నింటిలో రాహుల్ రామకృష్ణ కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఉన్నట్లుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటనేది మాత్రం తెలియడం లేదు. మెకానికల్ ఇంజరీనింగ్ చదువుకుంటున్న రాహుల్ రామకృష్ణ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి రావాలనుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. 2014లో సైన్మా అనే షార్ట్ ఫిలింతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంతో సినీ రంగంలోనికి వచ్చారు. తర్వాత 2017లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన అర్జున్ రెడ్డిలో హీరో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో మెప్పించడంతో రాహుల్ రామకృష్ణకు నటుడిగా ఇంకా మంచి గుర్తింపు దక్కింది. కామెడీ అంటే ఏదో ఒక మేనరిజమ్‌తోనే నవ్వించాలని కాకుండా సిట్యువేషనల్ డైలాగ్స్‌తోనూ ఆకట్టుకుంటూ, ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చారు. అలాగే కల్కి, రీసెంట్‌గా రిలీజ్ అయిన స్కై లాబ్ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన చిత్రాల్లో RRR, విరాట పర్వం వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే రాహుల్ రామకృష్ణ 2022 తర్వాత ఇక సినిమాల్లో నటించను అని తెలియజేస్తూ చేసిన ట్వీట్‌పై నెటిజన్స్ పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ రకంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. బ్రో సీరియస్సా? అని ఒకరు అంటే, ‘ఏదో ప్రమోషన్ అనుకుంటా.. లేదా కెరీర్ చేంజ్ అవుతాడేమో’ అని మరొకరు అన్నారు. ‘ఏంటి ప్రాంక్ చేస్తున్నారా’’ అని కూడా అంటున్నారు. మరి దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో మరి చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/xitpIgq
No comments:
Post a Comment