సొంత ప్రభుత్వంపై ఇంత తిరుగుబాటా..? అన్నట్టుగా ట్వీట్ వదులుతూ తనకు ఆ సీన్ చూసి భయంతో చలిజ్వరం వచ్చిందని పేర్కొన్నారు ఆర్జీవీ. అదేంటి? రామ్ గోపాల్ వర్మకు చలిజ్వరం రావడమా? అది కూడా భయంతో.. నమ్మశక్యంగా లేదే! అనుకుంటున్నారు కదూ. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాలా చెప్పిన మాటే. సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యారో లేక నిజంగానే భయపడ్డారో తెలియదు గానీ మరోసారి ఏపీ, జగన్ ప్రభుత్వంపై చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ''AP సర్కార్ సంగతేమో గానీ విజయవాడలో జన సందోహాన్ని చూసి నాకు భయంతో చలిజ్వరం వచ్చేసింది'' అని పేర్కొంటూ జన సందోహం ఫొటో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ. గురువారం రోజు ఏపీలోని విజయవాడలో ఉద్యోగులు నిర్వహించిన '' ర్యాలీకి భారీ ఎత్తున ఉద్యోగులు తరలి రావడంపై వర్మ ఇలా రియాక్ట్ అయ్యారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం అనేది రియల్లీ షాకింగ్, ప్రపంచంలో ఇంత మంది ఉద్యోగులు నిరసన తెలియజేయడం ఇదే తొలిసారి అనే అనుమానంగా ఉందంటూ తనదైన కోణంలో సెటైర్స్ వేశారు వర్మ. దీంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్స్ పలు చర్చలకు తెరలేపాయి. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చలి జ్వరం అంటున్నావు.. కరోనా ఉందేమో టెస్ట్ చేయించుకో అంటూ వర్మకు రివర్స్ కౌంటర్ వేస్తున్న వాళ్ళు కొందరైతే.. దీనిపై కూడా సినిమా ఏమైనా తీస్తావా? అనేవారు ఇంకొందరు. సినిమా వాళ్లకు కష్టమొస్తే మాట్లాడడానికి చిరంజీవి ఉన్నాడు.. మరి వాళ్ళకెవరున్నారు? అందుకే ఇలా రోడ్ల మీదకొచ్చారు అంటూ మరికొందరు కామెంట్స్ వదులుతున్నారు. ఏపీ ప్రభుత్వం నూతన పీఆర్సీపై అమలు చేసిన జీవోలపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఏపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాలు ఛలో విజయవాడకు పిలుపునివ్వడంతో రికార్డు స్థాయిలో ఉద్యోగులు ఇలా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వం పెట్టిన తీవ్ర ఆంక్షల నడుమ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరావడంతో ఆయా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/vDfZPCg
No comments:
Post a Comment