ఎంటైర్ ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా RRR. రిలీజ్‌కు వారం కూడా లేని సమయంలో మేకర్స్ సినిమా రిలీజ్‌ను మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు చెప్పేశారు. దీంతో ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఆశలపై బిందెడు నీళ్లు పోసినట్లయ్యింది. అసలే హార్డ్ కోర్ ఫ్యాన్స్.. కారణాలు వింటారా? వినరుగా.. తమదైన స్టైల్లో నెట్టింట మీమ్స్‌తో రెచ్చిపోయి.. మేకర్స్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఇందులో గమనించాల్సిన విషయమేమంటే.. అందులో కొన్ని మీమ్స్ రాజమౌళి సినిమాలోనివి కావడమే. కోవిడ్ ప్రభావం ఎక్కువ అవుతుండటంతో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్‌ను పూర్తిగా మూసి వేస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు మాత్రం థియేటర్స్‌ను 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవచ్చునని అంటున్నాయి. అయితే ఈ ఆక్యుపెన్సీతో రన్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్‌కు పెట్టిన ఖర్చు తిరిగి రాదు. ఆ కారణంగా RRR మేకర్స్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు డైరెక్షన్‌లో రూపొందిన చిత్రమిది. 1920 బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. ఈ చిత్రంలో ఇంకా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్‌తో పాటు సముద్ర ఖని, శ్రియా శరన్ వంటి వారు హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ తదితరులు నటించారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. RRR Memes:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pJ5QZE
No comments:
Post a Comment