కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం Chapter 2. ప్రశాంత్ నీల్ దర్శకుడు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గత ఏడాది అక్టోబర్‌లో విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 14, 2022కి వాయిదా పడిన సంగతి కూడా తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ఒకటి. KGF Chapter 1 విడుదలై 3 మూడేళ్లు దాటేసింది. బాహుబలి స్ఫూర్తితో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. దీంతో KGF Chapter 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎక్స్‌పెక్టేషన్స్‌కు తగ్గట్టే మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ రేంజ్‌లో నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్‌ను అధీర అనే విలన్ పాత్రలో నటింప చేశారు. అలాగే మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ పొలిటీషియన్ పాత్రలో కనపించనున్నారు. సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయనడానికి కొన్నాళ్లు ముందు రిలీజ్ అయిన టీజర్‌కు వచ్చిన వ్యూస్ కారణం. KGF Chapter 2 టీజర్‌కు ఏకంగా 230 మిలియన్ వ్యూస్‌కి పైగా రావడం ఓ రికార్డ్. అంతే కాదండోయ్ ఏకంగా ఈ టీజర్‌కు 9 మిలియన్స్‌కు పైగా లైకులే వచ్చాయంటే ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారనేది ఊహించవచ్చు. KGF Chapter 2పై ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గించకూడదని మేకర్స్ చాలా లావిష్‌గా ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ ఓల్డ్ సెన్సేషనల్ సాంగ్‌ను రీమిక్స్ చేశారట. ఇంతకీ KGF Chapter 2 కోసం రీమిక్స్ చేసిన పాట ఏదో కాదు.. ‘మెహబూబా మెహబూబా..’ అనే పాట. ఈ సాంగ్ ఎందులోనిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ సినీ హిస్టరీలో మైల్‌స్టోన్ మూవీగా ఇప్పటికీ మన మనసుల్లో నిలిచిపోయిన ‘షోలే’ సినిమాలోనిది. ఆ సినిమాలో ‘మెహబూబా మెహబూబా..’ సాంగ్ ఇప్పటికీ మనం వింటుంటే ఎంజాయ్ చేస్తాం. అలాంటి సెన్సేషనల్ సాంగ్‌ను నేటి తరానికి తగ్గట్లు రీమిక్స్ చేసి షూట్ చేశారట. అయితే ఈ పాటలో ఎవరు డాన్స్ చేశారనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. KGF Chapter 2లో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇంకా ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి రవి బసూర్ సంగీత సారథ్యాన్ని వహించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eKhvRP
No comments:
Post a Comment