నేచురల్ స్టార్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా సినిమా విడుదలైంది. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు దాదాపు అరవై కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు టాక్. విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా సినిమాకు రూ.22 కోట్లు మాత్రమే వచ్చాయి. ఏపీలో నెలకొన్న థియేటర్ పరిస్థితులు, తగ్గించిన టికెట్ రేట్స్ అన్నింటి కారణంగా శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్‌పై ప్రభావాన్ని చూపాయనడంలో సందేహం లేదు. శ్యామ్ సింగరాయ్ ఇలాంటి పరిస్థితుల్లో విడుదలై మంచి టాక్‌తో మంచి వసూళ్లను సంపాదించుకున్నా, నిర్మాతకు ఇబ్బందే కదా. ఈ విషయాన్ని హీరో నాని గుర్తించారు. ఎందుకంటే ఆయన కూడా ఓ నిర్మాతే మరి. అందుకనే ఆయన రెమ్యునరేషన్‌లో ఎక్కువ భాగాన్ని వెనక్కి ఇచ్చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న గుసగుసల మేరకు నాని తను తీసుకున్న రెమ్యునరేషన్‌లో రూ.5కోట్లను నిర్మాతకు తిరిగి ఇచ్చేశారట. రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత నిర్మాతలను హీరోలు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది నిర్మాత కోసం నాని రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని వెనక్కి ఇవ్వడం చాలా మంచి విషయమని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులు, ఏపీలో సినిమా టికెట్ తగ్గడం వంటి కారణాలతో నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయడానికి వెనుకా ముందు అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సినిమాను ధైర్యంగా విడుదల చేసిన నిర్మాతలకు తన వంతు సపోర్ట్ అవసరం అని భావించి నాని అలా చేశారట. మరి మిగతా హీరోలు కూడా అలా చేస్తారా? అని నాని అభిమాలను వేస్తున్న ప్రశ్న. ఓ రకంగా వారు వేస్తున్న ప్రశ్న కూడా నిజమే. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ నిలబడాలంటే హీరోలు సహా అందరూ నిర్మాతలకు అండగా నిలబడాలి. దేవదాసీ వ్యవస్థపై ధైర్యంగా పోరాటం చేసిన వ్యక్తి కథాంశంతో శ్యామ్ సింగరాయ్ సినిమాను రూపొందించారు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా హీరోయిన్స్‌గా నటించారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mIGVna
No comments:
Post a Comment