ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. భీష్మతో హిట్ కొట్టిన నితిన్ చెక్ సినిమాతో బోల్తా పడ్డాడు. ఆ తరువాత రంగ్ దే సినిమా అయినా హిట్ అవుతుందని ఆశపడ్డాడు. అది కూడా మిశ్రమ ఫలితాన్నే మిగిల్చింది. అలా నితిన్ జోరు ఇప్పుడు కాస్త తగ్గింది. అయితే అంధాదున్ రీమేక్‌తో వస్తోన్న నితిన్ మంచి విజయాన్ని అందుకునేందుకు రెడీగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఓ వైపు జోరుగా సాగుతూనే ఉంది. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేశారు. తమన్నా అయితే ఇప్పటికే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించేసింది. హిందీలో టబు పోషించిన పాత్రను తెలుగులో తమన్నా పోషించబోతోంది. ఇక హీరోయిన్‌గా నభా నటేష్ దుమ్ములేపనుంది. ఇప్పటికే వదిలిని స్టిల్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మొదటి పాటను విడుదల చేశారు. నేటి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓ బేబీ అనే సాంగ్‌ను విడుదల చేశారు. మహతి స్వరసాగర్ సంగీతమందించిన ఈ పాటను శ్రీజో రాయగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మొత్తానికి మహతి స్వరసాగర్‌ను మాత్రం నితిన్ వదలడం లేదు. భీష్మ వంటి కూల్ హిట్ ఇవ్వడంతో మహతి స్వర సాగర్‌తో నితిన్‌కు మంచి ర్యాపో ఏర్పడినట్టుంది. ఈ సినిమాను మేర్లపాక గాంధీ తన స్టైల్లో తెరకెక్కిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hHIlfC
No comments:
Post a Comment