ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు రూపొందించడంలో దిట్ట అనే సంగతి మనందరికీ తెలుసు. ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలన్నా, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యే డైరెక్టర్ అని అనాలన్నా, అడల్ట్ కంటెంట్‌తో హాట్ హాట్ సినిమాలు చేసే డైరెక్టర్ అని చెప్పుకోవాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఎవ్వరేమనుకుంటే నాకేంటి? నా దారి నాదే అంటూ దూసుకుపోయే ఆయన, ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలపై అడల్ట్ మూవీస్ రిలీజ్ చేస్తూ వస్తున్న వర్మ.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయి హాట్ డోస్ పెంచేస్తున్నారని టాక్. తనకు నచ్చిన కథలను, కాన్సెప్ట్‌లను వెండితెరపైకి తీసుకు వస్తూనే వినూత్నంగా ఆలోచనలు చేస్తున్నారు వర్మ. తన సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసుకుంటూ పబ్లిసిటీ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తాను రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఐస్ క్రీమ్' ఫ్రాంచైజీలో మూడవ సినిమా కోసం రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఇందుకోసం బ్యాక్ గ్రౌండ్లో అంతా సిద్ధం చేశారట ఆర్జీవీ. 2014 సంవత్సరంలో వచ్చిన 'ఐస్ క్రీమ్' మూవీ ఓ వర్గం ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. నవదీప్, తేజస్విని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాపై ఒకింత విమర్శలు కూడా వచ్చినా అవేవీ పట్టించుకోకుండా ఆ సినిమా సీక్వల్ 'ఐస్ క్రీమ్ 2' విడుదల చేశారు వర్మ. ఇక ఇప్పుడు మూడో భాగం కూడా తీయాలని ఫిక్స్ అయిన ఆయన.. నేటితరం ఆడియన్స్ మెచ్చేలా ఇందులో రెట్టింపు హాట్ డోస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. గత రెండు సినిమాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి, వర్మ ఈ మూడో భాగాన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది. సో.. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకొస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BgV7t8
No comments:
Post a Comment