నీడ మూవీ రివ్యూ.. మార్క్ చూపించిన నయన్

మలయాళి చిత్రాలు అంటే అందరికీ ఆసక్తి ఏర్పడుతుంది. భిన్న కథలు, కథనాలకు అది కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక అందులోనూ వంటి హీరోయిన్ నటించిందంటే సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో అందరూ ఊహించుకోవచ్చు. మలయాళంలో ‘నిజల్’గా ఏప్రిల్ విడుదలైన ఈ మూవీని ఇప్పుడు తెలుగులో అంటూ వచ్చేసింది. ఆహాలో నేడు (జూలై 23) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నీడ తెలుగు వారిని ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం. జిల్లా మెజిస్ట్రేట్ జాన్ బాబి (కుంబకో బోబన్‌) ఓ ప్రమాదంలో గాయపడతాడు. అప్పటి నుంచి అతనికి ఓ వింత సమస్య ఏర్పడుతుంది. ఎర్రటి ఎండలోనూ వాన పడుతున్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. ఇక అదే సమయంలో షర్మిళ (నయనతార) కొడుకు నితిన్ (ఇజిన్ హష్) వయసుకు మించిన కథలు చెబుతుంటాడు. ఆశ్చర్యకరం ఏమిటంటే.. ఆ కథలు ఏ మాత్రం కల్పనగా ఉండవు. అందులోని స్థలం, వర్ణించే తీరు అన్నీ కూడా కళ్లకు కట్టినట్టు, చూసినట్టు ఉంటాయి. ఈ విషయాన్ని సైక్రియార్టిస్ట్ అయిన షాలిని (దివ్య ప్రభ) తన ఫ్రెండ్ అయిన జాన్ బాబికి చెబుతుంటుంది. అలా జాన్ బాబి తన దృష్టిని నితిన్ మీదకు మళ్లిస్తాడు. తన సమస్య, ఆ పిల్లాడి సమస్యకు ఏదైనా లింక్ ఉంటుందేమోననే కోణంలో పరిశోధన ప్రారంభిస్తాడు. పిల్లాడు చెప్పిన కథలోని ప్రాంతాలకు వెళ్తాడు. అక్కడ నిజంగానే నితిన్ చెప్పినట్టుగా శవం కనిపిస్తుంది. అసలు నితిన్ ఈ కథలు ఎలా చెబుతున్నాడు? ఎప్పుడో పాతికేళ్ల క్రితం జరిగిన ఈ హత్యల గురించి నితిన్‌కు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? వీటి వెనుకున్న రహస్యం ఏంటి? ఈ ప్రయాణంలో జాన్ బాబికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే నీడ. కూల్ మెజిస్ట్రేట్ పాత్రలో జాన్ బాబిగా బోబన్ సరిగ్గా సరిపోయాడు. ఇక ఇండిపెండెంట్ వుమెన్, సింగిల్ పేరెంట్‌గా నయనతార చక్కగా నటించింది. ఎప్పటిలానే నయనతార నటనలో తన మార్క్‌ను చూపించింది. నీడ కథ అంతా కూడా నయనతార, బోబన్, ఇజిన్ హష్‌ల చుట్టే తిరుగుతుంది. బోబన్, నయనతారలతో పాటు ఇజిన్ హష్‌కు కూడా మంచి స్కోప్ లభించింది. ఇక ఇతర పాత్రల్లో సైక్రియార్టిస్ట్‌గా దివ్య ప్రభ చక్కగా సరిపోయారు. చివర్లో పది నిమిషాలు కనిపించే పాత్ర అయినా కూడా విశ్వనాథ్‌గా లాల్ మంచి ట్విస్ట్ ఇస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేరకు నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడూ కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఆసక్తికరమైన పాయింట్‌తో కథను మొదలుపెట్టి.. ఇక దాన్ని రీసెర్చ్ చేస్తున్నట్టుగా చూపించడం, ఎంతకీ సమస్య ఓ కొలిక్కి రాకపోవడం, చివరకు అదిరిపోయే ట్విస్ట్‌లుఇవ్వడం జరుగుతుంది. నీడలోనూ అంతే. బిగిసడలని కథనాన్ని మేకర్స్ ఎంచుకున్నారు. నీడను చివరి వరకు చూసేలా చేయడంలో స్క్రీన్ ప్లే అందించిన సంజీవ్, దర్శకత్వం వహించిన అప్పు ఎన్‌. భట్టాత్రి పని తనం కనిపిస్తుంది. పిల్లాడు చెబుతున్న కథలు అవి కథలు కావని, నిజంగా జరుగుతున్నాయని అయితే ఆ కథలు ఎవరు చెబుతున్నారు? ఎందుకు చెబుతున్నారు? ఎలా చెబుతున్నారు? అని ఇలా చూస్తున్న ప్రేక్షకుడు సైతం ఆలోచనలో పడుతుంటాడు. కథనం అలా ముందుకు సాగుతూ ఉంటే ప్రేక్షకుడు సైతం తన ఆలోచనలు పరుగులుపెట్టిస్తుంటాడు. అలా చివరకు ఇచ్చిన ట్విస్ట్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిత్రాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ప్రాణంలా నిలుస్తాయి. నీడ విషయంలోనూ అదే జరిగింది. సూరజ్‌ ఎస్‌.కరప్‌ కొట్టిన నేపథ్య సంగీతం కొన్ని సార్లు భయపెడతాయి. ఇక కెమెరామెన్‌గా దీపక్‌ డి.మేనన్‌ తన ప్రతిభను చూపించేశాడు. నీడ సినిమాకు ప్లస్ అయ్యేది నిడివి. తక్కువ లెంగ్త్‌తో వచ్చి.. అసలు విషయాన్ని సూటిగా చెప్పేశారు. ఎక్కడా కూడా అనవసరపు సన్నివేశాలున్నాయని అనిపించవు. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బాగానే ఉన్నా.. అయ్యో అసలు విషయం ఇదా? ఇంతేనా? అనేట్టు ముగుస్తుంది. చివరగా.. నీడ మరీ అంతగా వెంటాడకపోవచ్చు!


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3By5QQ7

No comments:

Post a Comment

Kajal Aggarwal connection with Muthayya 

Kajal Aggarwal connection with Muthayya Kajal Aggarwal unveils the poster of debut director Bhaskar Maurya’s Telugu film  Muthayya. The...

Popular posts