
సినీ నటులు ఖరీదైన కార్లు వాడుతుండటం కామనే. తమ స్టేటస్ సింబల్‌గా లగ్జరీ మెయిన్‌టైన్ చేస్తుంటారు సినీ స్టార్స్. అయితే పవర్ స్టార్ విషయంలో అలాంటి సందర్భాలు చాలా అరుదు. ఎక్కువగా సింప్లిసిటీకే ప్రియారిటీ ఇచ్చే ఆయన.. రీసెంట్‌గా ఓ ఖరీదైన కారు కొన్నారంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకోసం ఆయన 4.5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఎక్కువగా సాదా సీదాగా ఉంటూ నిరాడంబరంగా కనిపించే పవన్ కళ్యాణ్.. తన అవసరాల నిమిత్తం రేంజ్ రోవర్ బుక్ చేశారని సమాచారం. సాధారణంగా రేంజ్ రోవర్ కారు కోటి నుంచి మొదలవుతుంది. అందులోని సదుపాయాలను బట్టి దాని రేటు 5 కోట్ల వరకు ఉంటుంది. అయితే పవన్ మాత్రం 4.5 కోట్ల రూపాయల కారు ఎంచుకున్నారని అంటున్నారు. స్టైలిష్ అండ్ రాయల్ లుక్‌లో ఉన్న ఈ కారులో అదిరిపోయే ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సమాచారం బయటకొచ్చాక పవర్ స్టార్ రేంజ్ అంటే ఇదీ మరి అని కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇకపోతే ఓ వైపు రాజకీయ కార్యకలాపాలు చూసుకుంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇటీవలే 'వకీల్ సాబ్' రూపంలో భారీ సక్సెస్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దీంతో పాటు 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌తో కలిసి దగ్గుబాటి రానా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. నివేధా పేతురాజ్, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hqvcGj
No comments:
Post a Comment