రియల్ హీరో ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేరు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. కరోనా కష్టకాలంలో సోనూ సూద్ చేసినా, చేస్తోన్న సేవల ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు.. ఇంకెంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. విద్య, వైద్యం, ఉపాధి ఇలా ఎంతో మందికి ఎన్నో రకాలు సాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే సోనూ సూద్‌కు ఎన్ని సత్కరాలు, అవార్డులు లభించినా తక్కువే అవుతుంది. అలాంటి సోనూసూద్ మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద వేసి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ఈ మేరకు సోనూ సూద్ తన పాత రోజులను గుర్తుకు చేసుకున్నారు. ఏదో సాధించాలని తన ఊరి నుంచి ముంబైకి రైలులో వచ్చిన నాటి రోజులను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. నాకు ఇప్పటికీ ఆ రోజులు గుర్తుకు ఉన్నాయి..లూథియానా నుంచి డీలక్స్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కి.. ముంబై రైల్వే స్టేషన్‌లో దిగాను. నా కోరికలను నెరవేర్చుకునేందుకు ముంబైలో అడుగుపెట్టాను. లూథియానా రైల్వే స్టేషన్‌లో ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కొనుక్కున్నాను. ఇలా ఇరవై ఏళ్ల తరువాత నేను ఆ మ్యాగజైన్ కవర్ పేజీ మీద ఉన్నాను.. ఇక ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. మన కలలు నెరవేర్చుకోవడానికి సమయం ఎంతైనా పట్టొచ్చు కానీ ఒకనాటికి నెరవేరుతుంది అని సోనూ సూద్ తన పాత రోజులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kchdHd
No comments:
Post a Comment