సాధారణంగా ఇద్దరు హీరోలు ఒకే తెరపై కనిపించడమంటే ప్రేక్షకుల్లో ఉండే ఆ ఆసక్తే వేరు. ఫేమ్ ఉన్న హీరోలతో రూపొందించే మల్టీస్టారర్ సినిమాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచే మల్టీస్టారర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ట్రెండ్ నడుస్తున్నపుడు మల్టీస్టారర్ సినిమాలు రాలేదు కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అలాంటి సినిమాలే కోరుకుంటున్నారు జనం. ఈ నేపథ్యంలో తాజాగా మెగా- అక్కినేని కాంబో రూపొందనుందనే క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇటీవలి కాలంలో మల్టీస్టారర్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ''సీతమ్మవాకిట్లో సిరిమెల్లెచెట్టు, గోపాల గోపాల'' సినిమాలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం దగ్గుబాటి రానా, పవన్ కళ్యాణ్ కాంబోలో మరో మల్టీస్టారర్ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ క్రమంలోనే మెగా క్యాంప్ హీరో , అక్కినేని హీరో అఖిల్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ రూపొందనుందనే వార్తలు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా ఓ దర్శకుడు సాయిధరమ్ తేజ్‌కి కథ వినిపించారట. ఆ కథ విన్న సాయి తేజ్.. ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్పారట. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో హీరోతో సమానమైన మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఉండటంతో దీన్ని మల్టీస్టారర్ సినిమాగా రూపొందించాలని చెప్పారట. మరో హీరో కోసం అక్కినేని లేదా అఖిల్ అయితే బెటర్ అని ఆ దర్శకుడికి చెప్పారట సాయి తేజ్. ఈ ఆలోచన నచ్చి సదరు దర్శకుడు అక్కినేని యంగ్ హీరోల డేట్స్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట. అఖిల్ గానీ చైతూ గానీ ఏ ఒక్కరు ఓకే చెప్పినా భారీ రేంజ్‌లో ఈ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. సో.. చూడాలి మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందనేది!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f2h9qi
No comments:
Post a Comment