విరుష్క (విరాల్ కోహ్లీ ) జంటకు జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. ఇక ఈ ఇద్దరు కాస్త ముగ్గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. తాము త్వరలోనే ముగ్గురం కాబోతోన్నాం, తమ జీవితంలోకి ఒకరు రాబోతోన్నారంటూ ప్రెగ్నెన్నీ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లాక్డౌన్ సమయంలో ఈ శుభవార్తను చెప్పారు. అలా ఇప్పుడు తమ బిడ్డ ఈ భూమ్మీదకు వచ్చి ఆరు నెలలు పూర్తైన సందర్భంగా విరుష్క జోడి ఎమోషనల్ అయింది. అనుష్క గర్భం దాల్చిన సమయంలోనూ కొంత ట్రోలింగ్ జరిగింది. విరాట్ తన భార్యను తనతో పాటు దుబాయ్‌కి తీసుకెళ్లడం, అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు విమర్శించారు. అయితే పండంటి బిడ్డ పుట్టిన తరువాత విరుష్క జోడి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని, త్వరలోనే పాప గురించి చెబుతామని అన్నారు. ఇక తమ పాపకు విరుష్క పెట్టిన పేరు కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటూ పెట్టిన పేరు అందరికీ తెగ నచ్చేసింది. అయితే దాని అర్థం తెలుసుకోవాలని అందరూ విరుష్క జోడిని అడిగేశారు. దానికి విరాట్ రిప్లై ఇస్తూ.. దుర్గామాతకు మరో పేరు అని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు విరుష్కల ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వమిక ఈ భూమ్మీదకు వచ్చిన ఆరు నెలలు పూర్తయ్యాయని చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. నా చిన్న పాప ఒక్క నవ్వుతో మా ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది.. నువ్ మమ్మల్ని అలా చూస్తుంటే మా ఈ జీవితాలను ఇలా హాయిగా గడిపేయోచ్చు.. నువ్ పుట్టి ఆరు నెలలు అవుతోంది అని అనుష్క శర్మ తన బిడ్డ గురించి చెప్పుకొచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e8GwpU
No comments:
Post a Comment