మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం వేడి మళ్లీ రేగింది. నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లలో ఒక్కసారిగా వివాదాలు మళ్లీ చెలరేగాయి. బాలయ్య పరోక్షంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు.. స్పెషల్ క్లాస్‌లో అమెరికాకు వెళ్లారు.. ఆ డబ్బులు ఏంచేశారంటూ బాలయ్య ప్రశ్నించారు. అవన్నీ కూడా చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్లేనని అందరికీ అర్థమవుతూనే ఉంది. ఇక మా ఎన్నికలపైనా బాలయ్య తన స్టైల్లో చెప్పుకొచ్చారు. తాను మరీ అంత స్థాయికి దిగజారలేనని, అలా తిట్టుకుంటున్నారు.. మా అనేది చిన్న సంస్థ.. అధ్యక్ష పదవి కోసం ఇలా బయటకు రావడం, తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం ఏమీ బాగాలేదంటూ చెప్పుకొచ్చారు. మంచు విష్ణు భవనం కడతాను అంటే తాను కూడా సాయం చేస్తాను.. మద్దతు ఇస్తాను అని నందమూరి బాలకృష్ణ అన్నారు. మా ఎన్నికల వ్యవహారంపై మరో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏకగ్రీవం చేయాలనే డిమాండ్ కూడా వస్తోంది. మురళీమోహన్ కూడా ఇదే అన్నారు. మొన్న మంచు విష్ణు కూడా పెద్దల సమక్షంలో ఏకగ్రీవం జరిగితే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. అయితే తాజాగా నాగబాబు మా ఎన్నికల వివాదాలపై మాట్లాడారు. ఎన్నికలు జరగకూడదు.. ఏకగ్రీవం చేయాలని అనుకోవడం తప్పు ఆలోచన.. ఎన్నికలు జరగాలి.. పోటీలో నిల్చోవాలి.. వారి వారి సామర్థ్యాన్ని, సమర్థను చూపించుకోవాలి.. మా ఈ గొడవలన్నీ కూడా రెండు నెలలు ఉంటాయి.. మాదంతా టీ కప్పులో తుపాను లాంటిది.. ఓ రెండు నెలలు మీడియా, జనాలను ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది.. ప్రకాశ్ రాజ్‌కి ఉన్న విజన్, ఆయన చెప్పిన ప్లానింగ్, అతని సామర్థ్యానికి మేం మద్దతిస్తున్నాం. ఆయన చెప్పిన విధానం, ‘మా’ కోసం ఆయన వీలైనంత సమయాన్ని కేటాయిస్తానని చెప్పారు. ఇక మంచు విష్ణు కూడా బిల్డింగ్ కడతాను అన్నారు.. ఆ స్థలం ఎక్కడ ఉందో.. ఎక్కడి నుంచి తెస్తారో చెబితే బాగుండేది అని నాగబాబు అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2USPAZ1
No comments:
Post a Comment