అనూహ్యంగా శనివారం రోజు కత్తి మహేష్ కన్నుమూయడంతో సినీ వర్గాల నుంచి చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై శ్రీ రెడ్డి రియాక్ట్ అయింది.
కత్తి మహేష్ మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిల్మ్ జర్నలిస్టుగా ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రివ్యూ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు సినిమాల్లో కూడా నటించి ఫేమ్ అయ్యారు. అయితే ఆయన కెరీర్ మొత్తం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌లా సాగింది. సినిమాలతో పాటు సామాజిక పరంగా కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మరోవైపు కత్తి మహేష్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వైరం నానాటికీ పెరుగుతూ వచ్చింది. అప్పట్లో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో కత్తి మహేష్‌ను ఆటాడుకున్నారు. అయితే అనూహ్యంగా శనివారం రోజు కత్తి మహేష్ కన్నుమూయడంతో సినీ వర్గాల నుంచి చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.
కత్తి మహేష్ కారు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి
జూన్ 26వ తేదీన నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కొడవలూరు హైవే వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు.. లారీని బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటినుంచి చికిత్స పొందుతున్న కత్తి మహేష్.. అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం రోజు కన్నుమూశారు.
రెచ్చిపోతున్న నెటిజన్లు.. ఏకంగా అలా!
కత్తి మహేష్ మరణవార్త తెలిసి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుండగా, ఇంకొందరు మాత్రం తమ హీరోను అన్ని మాటలు అనడం వల్లనే ఇలా జరిగిందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్స్ అప్పట్లో రాముడిపై ఆయన చేసిన కామెంట్స్ వీడియోలు బయటపెడుతూ 'దేవుడిని అంటే కళ్లు పొతాయి అనడానికి నీ మరణం ఒక ఉదాహరణ' అని పేర్కొంటున్నారు.
శ్రీ రెడ్డి ఎంటర్.. బుర్రలేని వెధవలు అంటూ
శ్రీ రెడ్డి 'కాస్టింగ్ కౌచ్' అంశం మొదలుపెట్టక ముందు నుంచే కత్తి మహేష్‌కు మంచి స్నేహితురాలు. మరోవైపు సందు దొరికితే పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడే విమర్శకురాలు. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న కామెంట్స్ చూసి రెచ్చిపోయింది. మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బుర్రలేని వెధవలు అన్నట్లు ట్రీట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎందుకురా పోజులు? బుర్ర వాడండి
''అందరూ వెనక, ముందు పోవాల్సిందే.. కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగలా చెప్పుకునేవాళ్ళకి అపహాస్యం చేసేవాళ్ళకి ఇదే నా ఆన్సర్. రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి, మీ హీరో కూడా పోతాడు.. మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా పోజులు?? బుర్ర అప్పుడప్పుడు వాడండి.. కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలి'' అంటూ శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఇది చూసి పీకే ఫ్యాన్స్ మరింత రెచ్చిపోతున్నారు. నెక్స్ట్ నువ్వే పోయేది.. రెడీగా ఉండు అంటూ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ మరో రచ్చకు దారి తీశాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xxwZjX
No comments:
Post a Comment