లైన్ లోకి 'ఉప్పెన' బ్యూటీ తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకుంది హీరోయిన్ . గ్లామర్ ట్రీట్‌కి కాస్త దూరంగా ఉంటూనే తనదైన నటనతో అట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తోంది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌లో కృతి జాయిన్ అయింది. ధనుష్.. 100 కోట్లపైనే తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీలే చెన్నైలోని పోయిస్ గార్డెన్‌లో కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నారు. ఇటీవలే దీనికి భూమి పూజ కూడా చేసిన ఆయన ఈ ఇంటి కోసం ఏకంగా 100 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి దగ్గరలోనే ఉన్న ఈ ఇంటిని తనకు నచ్చిన రీతిలో డిజైన్ చేయించుకుంటున్నారట ధనుష్. ఒంటరిగానే బెస్ట్ 'జయం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సదా.. తన పెళ్లి విషయమై ఓపెన్ అయింది. తన మనస్తత్వానికి మ్యాచ్ అయ్యేవాడు దొరికితేనే పెళ్లి లేదంటే ఒంటరిగానే ఉంటా అని చెప్పింది. అయినా ఒంటరి జీవితమే బెస్ట్ అంటూ తన మనసులోని మాట బయటపెట్టింది సదా. ప్రభాస్‌తో హీరోయిన్ డ్రీమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో నటించడం తన డ్రీమ్ అని చెప్పింది శృతి హాసన్. డార్లింగ్ ప్రభాస్ సరసన 'సలార్' చిత్రంలో నటిస్తున్న ఆమె.. ప్రభాస్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తోందట. ఈ సినిమాలో శృతి ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందని సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jr2uYG
No comments:
Post a Comment