బుల్లితెరపై మాటలతో మాయ చేసే కమెడియన్ హైపర్ ఆది. ప్రస్తుత పరిస్థితులనే స్కిట్స్‌గా ఎంచుకుంటూ మాటమాటకు తూటా పేల్చడం నైజం. మనోడి స్కిట్ వస్తుందంటే స్కిప్ చేయకుండా చూడాల్సిందే. అదీ ప్రస్తుతం ఆదికి ఉన్న క్రేజ్. బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై కూడా అప్పుడప్పుడు అలా మెరుస్తున్న ఈ కమెడియన్.. తాజాగా పవన్ కళ్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు. ఫేమస్ యాక్టర్స్ పొలిటీషిన్స్‌గా మారడం సర్వసాధారణమే. ఇప్పటికే ఎందరో స్టార్స్ రాజకీయ బాట పట్టి ప్రజాక్షేత్రంలో వెలిగిపోతున్నారు. ఈ క్రమంలో కూడా అదే బాట ఎంచుకొని పెట్టిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్.. తిరిగి సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్క్ చూపెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీలో చేరే విషయమై క్లారిటీ ఇచ్చారు హైపర్ ఆది. పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే హైపర్ ఆది.. ఆయన పార్టీలో చేరే ఛాన్స్ ఉందా? అంటూ యాంకర్ వేసిన ప్రశ్నపై బదులిచ్చారు ఆది. పవన్ కళ్యాణ్‌కి తానెప్పుడూ సపోర్ట్ చేస్తానని, గతంలో ఎలక్షన్స్ సమయంలో జనసేన పార్టీకి క్యాంపెయిన్ కూడా చేశామని అన్నారు. ఒకవేళ ఫ్యూచర్‌లో పాలిటిక్స్ లోకి వెళ్లాలనే ఆలోచన వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీలోనే చేరతానని హైపర్ ఆది చెప్పడం విశేషం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఏది చేస్తే అది కరెక్ట్ అని నమ్మకం పెట్టుకోవాలంతే అంటూ సింపుల్‌గా చెప్పారు హైపర్ ఆది. ఆయన కోసం ఎన్నేళ్ళైనా అండగా నిలబడతాం అని అన్నారు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా అంటూ అప్పట్లో జనసైనికుల్లో జోష్ నింపిన హైపర్ ఆది.. తాజాగా మరోసారి జనసేన పార్టీ గురించి ఇలా స్పందించడం ఆసక్తికరంగా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33bT4tX
No comments:
Post a Comment